ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Earring styles : చెవి రంధ్రాలు సాగితే...

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:29 AM

ఫ్యాషన్‌లో భాగంగా మహిళలు రకరకాల చెవి పోగులు, జుంకాలు, హ్యాంగింగ్స్‌ పెట్టుకుంటూ ఉంటారు. వీటి బరువు వల్ల చెవి రంధ్రాలు క్రమంగా పెద్దవై సాగుతుంటాయి. అలాంటప్పుడు చెవులకు ఆభరణాలు వేలాడకుండా అందంగా అమరేలా కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

ఫ్యాషన్‌లో భాగంగా మహిళలు రకరకాల చెవి పోగులు, జుంకాలు, హ్యాంగింగ్స్‌ పెట్టుకుంటూ ఉంటారు. వీటి బరువు వల్ల చెవి రంధ్రాలు క్రమంగా పెద్దవై సాగుతుంటాయి. అలాంటప్పుడు చెవులకు ఆభరణాలు వేలాడకుండా అందంగా అమరేలా కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

  • బరువైన జుంకాలు, లోహాలతో రూపొందించిన కమ్మలు పెట్టుకునేటపుడు సిలికాన్‌తో తయారు చేసిన ఇయర్‌ లోబ్‌ ప్యాడ్స్‌ను ఉపయోగించాలి. ఇవి ఆధారంగా నిలిచి ఆభరణం వేలాడకుండా చెవి తమ్మె మీద పూర్తిగా అమరేలా చేస్తాయి.

  • కర్ణాభరణాలకు బ్యాక్‌ స్టాపర్‌ స్థానంలో డబుల్‌ స్టాపర్‌ను ఉపయోగిస్తే జారకుండా నిలబడతాయి.

  • చెవి క్లిప్‌ ఉన్న జుంకాలు ఎంచుకోవడం మంచిది. ఇవి రంధ్రం మీద బరువు పడనీయకుండా చెవి మీద నిటారుగా నిలుస్తాయి.

  • చూడడానికి భారీగా కనిపిస్తున్నప్పటికీ అంత బరువు లేని కర్ణాభరణాలు ప్రస్తుతం విరివిగా లభ్యమవుతున్నాయి. వీటిని ఎంపిక చేసుకుంటే చెవి రంధ్రాలు కనపించవు. అంతేకాదు రంధ్రాలు మరింత సాగకుండా ఉంటాయి.

  • రాళ్లతో నిండిన బరువైన జుంకాలను ఎక్కువసేపు ధరించవద్దు. నిద్రించేముందు, స్నానం చేసేముందు చెవి ఆభరణాలను తీయాలి.

  • చెవులకు కమ్మలు పెట్టుకునేముందు రంధ్రం మీద కొబ్బరి నూనె లేదంటే బాదం నూనె రాసి మెల్లగా మర్దన చేయాలి. దీనివల్ల కండరాలు బిగుతుగా మారి ఆభరణాలను జారనివ్వవు. ఇ-విటమిన్‌ నూనె రాసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • గుప్పెడు వేపాకులను తీసుకుని ముద్దగా నూరి దానిలో అరచెంచా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని చెవి రంధ్రం మీద రాయాలి. ఇలా తరచూ రాస్తే చర్మం పెరిగి రంధ్రం చిన్నగా మారుతుంది.

  • చెవి రంధ్రం బాగా పెద్దదై సాగిపోతే వైద్యుని సలహా మేరకు కుట్లు వేయించుకోవాలి.

Updated Date - Jan 22 , 2025 | 01:29 AM