ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహజంగా బరువు తగ్గే మార్గాలు ఇవే...

ABN, Publish Date - Mar 06 , 2025 | 06:01 AM

అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. సహజ మార్గాల్లో సులభంగా బరువు తగ్గే చిట్కాలను ఇలా సూచిస్తున్నారు...

అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. సహజ మార్గాల్లో సులభంగా బరువు తగ్గే చిట్కాలను ఇలా సూచిస్తున్నారు...

  • ప్రతిరోజూ పావు చెంచా నల్ల జీలకర్ర లేదా కలోంజీని ఆహారంలో చేర్చుకుంటే మూడు నెలల్లో బరువు తగ్గవచ్చు.

  • ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా శొంఠి పొడి కలుపుకుని తాగితే శరీరంలోని కొవ్వులు కరగి బరువు తగ్గుతారు.

  • ప్రతిరోజూ ఉదయం అల్పాహారం మానకూడదు. ఇందులో పాలు, గుడ్లు, వెజిటబుల్‌ సూప్‌, బ్రౌన్‌ బ్రెడ్‌, సలాడ్‌ ఉండేలా చూసుకోవాలి.

  • భోజనం చేసిన గంట తరవాత రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది.


  • పాలు, చక్కెర కలిపిన టీ, కాఫీ తాగడానికి బదులు నిమ్మరసం, తేనె కలిపిన గ్రీన్‌ టీ తాగితే శరీరంలోని వ్యర్థపదార్థాలన్నీ విసర్జితమవుతాయి. జీవక్రియలు వేగవంతమై శరీర బరువు క్రమంగా తగ్గుతుంది.

  • దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా రెండు గంటలకు ఒకసారి ఒకగ్లాసు మంచినీరు తాగడం వల్ల జీర్ణాశయం పనితీరు మెరుగవుతుంది. తిన్న ఆహార పదార్థాలన్నీ త్వరగా జీర్ణమవుతాయి. మలబద్దకం లేకుండా పొట్ట శుభ్రంగా ఉంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • భోజనం వేళలను క్రమం తప్పకుండా పాటించాలి. రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం పూర్తి చేయాలి.

  • ప్రోటీన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనెలు, తీపి పదార్థాలు తినడం తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు తింటూ ఉంటే పోషకాలు అంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఊబకాయం తగ్గుతుంది.

  • నిద్రలేమి కూడా అధిక బరువుకి కారణమవుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 06 , 2025 | 06:01 AM