Peace : శాంతిపథంలో తొలి మెట్టు
ABN, Publish Date - Feb 06 , 2025 | 10:52 PM
మనం చదువుకోవాలంటే బడికి వెళ్ళాలి. ఆడుకోవాలంటే ఆట వస్తువులు బజార్లో దొరుకుతాయి. ఇలా మనకు కావలసింది ఏదైనా మన దగ్గర లేదనే విషయాన్ని ప్రపంచం మనకు నేర్పుతుంది. శాంతి విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తాం. కానీ అది ఎక్కడో బయట ఉండదు. మన లోపలే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. శాంతి పథంలో ఇదే తొలిమెట్టు.
మనం చదువుకోవాలంటే బడికి వెళ్ళాలి. ఆడుకోవాలంటే ఆట వస్తువులు బజార్లో దొరుకుతాయి. ఇలా మనకు కావలసింది ఏదైనా మన దగ్గర లేదనే విషయాన్ని ప్రపంచం మనకు నేర్పుతుంది. శాంతి విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తాం. కానీ అది ఎక్కడో బయట ఉండదు. మన లోపలే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. శాంతి పథంలో ఇదే తొలిమెట్టు.
శాంతి మీలోనే ఉంది...
మీరు తొలి అడుగు వెయ్యవలసింది ముందుకు కాదనీ, వెనక్కి అనీ నేను చెప్పినప్పుడు... చాలామంది ‘ఎప్పుడూ ముందుకే అడుగు వెయ్యాలి కదా!’ అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ముందుకు కాదు, లోపలివైపు అడుగు వెయ్యాలి. ఎందుకంటే మీకు అవసరమైన శాంతి మీలోనే నిక్షిప్తం అయి ఉంది. ఇప్పుడు కూడా ఉంది. మీరు కోపంతో రగిలిపోతున్న సమయంలో కూడా ఉంటుంది. అలాగే మీరు దుఃఖంలో విలవిలలాడిపోతున్న సమయంలో, సుఖ సంతోషాలతో తులతూగుతున్న సమయంలో కూడా ఉంటుంది. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా, కటిక పేదవారైనా, గొప్ప ఐశ్వర్యవంతులైనా ప్రతి ఒక్కరూ దాన్ని స్వయంగా అనుభూతి పొందవచ్చు.
అది అసాధ్యం కాదు...
ఎవరికో దాహంగా ఉందని తెలిసి... నేను నాలుగు గ్లాసుల నీరు ఇచ్చి వచ్చాను. ‘‘అతని దాహం తీరిపోయి ఉంటుందా?’’ అని ఎవరైనా అడిగితే... ‘‘నేను నాలుగు గ్లాసుల నీరు ఇచ్చి వచ్చాను, తప్పకుండా తీరిపోయి ఉంటుంది’’ అని చెబుతాను. కానీ ఆ వ్యక్తి నీరు తాగకుండా ఉంటే దాహం ఎలా తీరుతుంది? శాంతి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. యుద్ధాలు జరగకపోతే శాంతి ఏర్పడుతుందని భావిస్తారు. కానీ శాంతిగా ఉన్నప్పుడు యుద్ధం ఎలా మొదలైంది? కాబట్టి ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కారణం... శాంతి లోపించడం. ‘ఇంతమందిని శాంతిపథంలో నడిపించడం అసాధ్యం’ అని మీకు అనిపించవచ్చు.
కానీ ఈ ప్రపంచంలో యాభైశాతం మంది శాంతిపథంలో అడుగు పెట్టినా... మిగిలిన వారిపై
ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. మీరు గడిపే
ఏ క్షణమైన మళ్ళీ తిరిగిరాదని గుర్తించి, ప్రతి రోజునూ కాపాడుకోవాలి. వృధాగా గడిచిపోకుండా చూసుకోవాలి.
దేన్నీ వదిలెయ్యాల్సిన అవసరం లేదు...
మనకు లభించిన ఈ జీవితకాలంలోని ప్రతి క్షణంలో దాగిన జీవన మాధుర్యాన్ని, శాంతిని అనుభూతి చెందడం చాలా అవసరం. జీవితంలో ఈ చిన్న పని చేయలేకపోతే మానవ శరీరం లభించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ మాట వినగానే ‘మేము మా సంసారాలను, ఇల్లు వాకిళ్ళను వదిలేసి వెళ్ళాలా?’ అని కొందరు అడుగుతారు. మీరు అవేవీ వదిలెయ్యాల్సిన పని లేదు. మీకు ఉన్న అన్ని బాధ్యతలను చక్కగా నిర్వహించండి. వాటితోపాటు మీలో కొలువై ఉన్న ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందే బాధ్యతను కూడా నెరవేర్చుకోమని చెబుతున్నాను. ఆ బాధ్యతను విస్మరించకండి. ఈ విషయాలన్నిటినీ కేవలం నమ్మితే సరిపోదు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మీరు జ్ఞానం స్వీకరించడానికి శ్రద్ధ ఉండాలి, ఆరాటం ఉండాలి. ఎందుకంటే మనిషిలో జిజ్ఞాస అనేది లేకపోతే విషయం అర్థం కాదు. మీలో ఉన్న శాంతి కోసం అన్వేషించండి. శాంతిని మీరు మీ అంతరంగంలోనే అనుభూతి చెందడం కోసం ప్రయత్నించండి.
ప్రేమ్ రావత్
9246275220
Updated Date - Feb 06 , 2025 | 10:52 PM