Social Customs : అంతా సమానమే
ABN, Publish Date - Feb 06 , 2025 | 10:46 PM
సమాజంలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. సాధారణ ప్రజలు వాటిని సాధ్యమైనంతవరకూ ఆచరిస్తారు. వయస్సులో పెద్దవారు వస్తే చిన్నవారు లేచి నిలబడతారు. పండితులు వస్తే పామరులు లేచి నిలబడి నమస్కరిస్తారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే... ఇతరులు వారికి స్వాగతం పలికి, పూలదండలు వేసి, శాలువాలు కప్పి తమ గౌరవాన్ని చాటుతారు. కానీ జ్ఞానులు ఇలాంటి సాంఘిక ఆచారాలు పాటించడంలో శ్రద్ధ
సమాజంలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి. సాధారణ ప్రజలు వాటిని సాధ్యమైనంతవరకూ ఆచరిస్తారు. వయస్సులో పెద్దవారు వస్తే చిన్నవారు లేచి నిలబడతారు. పండితులు వస్తే పామరులు లేచి నిలబడి నమస్కరిస్తారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తే... ఇతరులు వారికి స్వాగతం పలికి, పూలదండలు వేసి, శాలువాలు కప్పి తమ గౌరవాన్ని చాటుతారు. కానీ జ్ఞానులు ఇలాంటి సాంఘిక ఆచారాలు పాటించడంలో శ్రద్ధ చూపించరు. పెద్దలు, పిన్నలు, ధనికులు, పేదలు, , పండితులు, పామరులు, రాజులు, సామాన్యులు... ఇలా అందరిపట్లా సమభావమే కనబరుస్తారు. వారికి అణకువ ఉండదు, అహంకారం కూడా ఉండదు. సమత్వ గుణం వారిలో తొణికిసలాడుతూ ఉంటుంది. తమలో లేని అణకువను, నమ్రతను కృత్రిమంగా తెచ్చిపెట్టుకొని నటించరు. తమకు ఏది చేయాలని తోస్తే అది చేస్తారు. ‘‘నాకు అణకువ మీద విశ్వాసం లేదు. నేను సమదర్శిత్వాన్ని నమ్ముతాను’’ అన్నారు స్వామి వివేకానంద. అలాంటి వ్యక్తి లావోట్జూ. చైనా తత్త్వవేత్తలలో కన్ఫ్యూసియస్ ప్రముఖుడు. అతను అన్ని మర్యాదలు, ఆచారాలు, పద్ధతులు తెలిసినవాడు. ప్రజలందరూ లావోట్జూ గురించి గొప్పగా చెప్పుకోవడం అతను విన్నాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న లావోట్జూను వెతుక్కుంటూ వెళ్ళి కలిశాడు. ప్రశాంతంగా కూర్చొని ఉన్న లావోట్జూతో ‘‘నేను కన్ఫ్యూసియస్‌ని. మీతో కొన్ని విషయాలు చర్చించాలని వచ్చాను’’ అన్నాడు. తన గొప్పతనం గురించి లావోట్జూ విని ఉంటాడనీ, తను ఎవరో చెప్పిన వెంటనే లేచి నిలబడతాడనీ ఊహించాడు. కానీ లావోట్జూ లేచి నిలబడలేదు.
అప్పుడు కన్ఫ్యూసియస్ ‘‘నేను నీకన్నా వయసులో పెద్దవాణ్ణి. పాండిత్యంలో నిన్ను మించినవాణ్ణి. లేచి నిలబడాలనే మర్యాద కూడా నీకు తెలీదా’’? అన్నాడు కోపంగా.
లావోట్జూ గట్టిగా నవ్వి ‘‘నాకన్నా ఎవరూ పెద్దవారూ లేరు, చిన్నవారూ లేరు. ‘నేను’, ‘పెద్దవాణ్ణి’ అనే అహంకారాన్ని పక్కన పెట్టి కూర్చో, మాట్లాడుకొందాం’’ అన్నాడు.
కన్ఫ్యూసియస్‌కు కనువిప్పు కలిగింది. తనకు ఉన్నది ఉత్త పాండిత్యమేననీ, లావోట్జూకు ఉన్నది అనుభవ జ్ఞానమనీ, ఆ జ్ఞానం ముందు తన మేధస్సు, పాండిత్యం నిర్జీవ పదార్థాలనీ తెలిసివచ్చింది. లావోట్జూ తను ఊహించలేనంత ఉన్నతుడని గ్రహించాడు. అతనికి నమస్కరించి, వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
రాచమడుగు శ్రీనివాసులు
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For National News And Telugu News
Updated Date - Feb 06 , 2025 | 10:46 PM