ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shri Mataji: దేవుడు నీలోనే ఉన్నాడు

ABN, Publish Date - Feb 21 , 2025 | 04:53 AM

మిమ్మల్ని సృష్టించిన శక్తితో మీరు అనుసంధానం కానంతవరకూ... మీ జీవిత పరమార్థం ఏమిటనేది తెలుసుకోలేరని ఆమె స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక గురువుగా... తను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని ఆమె స్వయంగా ఆచరించి చూపారు

‘‘కులాలు, మతాలు అనేవి కేవలం మానవుల సృష్టే. భగవంతుడికి వాటితో ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరిలో ఈ అవగాహన కల్పించి, సరైన పరివర్తన తీసుకురాగలిగితే... నవ సమాజం, వసుధైక కుటుంబం, సర్వమానవ సౌభ్రాతృత్వం, ద్వేషరహితమైన, ప్రేమపూరితమైన ప్రపంచం ఏర్పడతాయి’’ అని ప్రకటించడమే కాదు, అది సాధ్యమేనని సహజయోగ ధ్యాన పద్ధతిద్వారా నిరూపించారు శ్రీమాతాజీ నిర్మలాదేవి. మిమ్మల్ని సృష్టించిన శక్తితో మీరు అనుసంధానం కానంతవరకూ... మీ జీవిత పరమార్థం ఏమిటనేది తెలుసుకోలేరని ఆమె స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక గురువుగా... తను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని ఆమె స్వయంగా ఆచరించి చూపారు.

అదే శివుడి ఇచ్ఛాశక్తి...

తన స్వీయ తపోశక్తితో 1970 మే 5న సహజయోగను శ్రీమాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించారు. తనలో నిద్రాణమైన స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి, బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమైక శక్తి అయిన పరమ చైతన్యంతో దాన్ని అనుసంధానం చేయడం ద్వారా.. ఆత్మ సాక్షాత్కార అనుభూతిని సాధించారు. దీనితో ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ‘సహ’ అంటే ‘మనతో’, ‘జ’ అంటే ‘జన్మించిన శకి’్త... ‘యోగ’ అంటే ‘బాహ్యపరంగా ఉన్న శక్తితో కలవడం’ అని అర్థం. ఈ విధంగా మనలోని కుండలినీ శక్తి విశ్వవ్యాపితమైన భగవత్‌ శక్తితో ఏకీకరణ పొందినప్పుడు... మనం కూడా ఆ దివ్య శక్తిలో ఒక కణంగా, భాగంగా మారిపోతాం. పరమ చైతన్యం లేదా బ్రహ్మ చైతన్యం అంటే విశ్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తి. విశ్వాన్ని, సకల చరాచర జీవులను నడిపించే ఆ భగవత్‌ శక్తి మానవుల మేధస్సుకు అతీతమైనది. సదాశివుని అర్ధాంగి అయిన ఆదిశక్తి... ఆయన చుట్టూ ఒక చల్లని మేఘంలా ఆవరించి ఉంటుంది. అదే బ్రహ్మ చైతన్యం. పరమ చైతన్య శక్తిగా పిలిచే ఆ శక్తే... పరమాత్మ అయిన శివుడి ఇచ్ఛాశక్తి. ఆ శక్తే విశ్వాన్ని సృష్టించింది. భూమి మీద ఉన్న జీవజాలం మీద తన పరమ చైతన్య శక్తిని వెదజల్లుతోంది. మనల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తోంది. మనలో ప్రేమ శక్తిగా అంకురిస్తోంది. అందుకే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, సహజయోగ సాధన చేస్తున్నవారందరూ ఆ భగవంతుడి ప్రేమ శక్తిని తమ చుట్టూ ఉన్నవారికి పంచడానికి కృషి చేస్తారు. ఈ సాధన చేస్తున్నవారిలో సహస్రార చక్రం పూర్తిగా వికసిస్తుంది. అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఉన్న ఏడు చక్రాలు తెరుచుకుంటాయి. బ్రహ్మచైతన్యంలో అంతర్భాగాలైన అధిష్టాన దేవతలు మేలుకొని, వారికి ఆశీస్సులు అందజేస్తారు. కుల, సహజయోగను మత, జాతి, ప్రాంత, వయసు, లింగ భేదాలకు అతీతంగా ఎవరైనా, ఎప్పుడైనా అతి సునాయాసంగా ఆచరించవచ్చు. ఇది దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొనే శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం.


అందరూ ఒక్కటే...

‘‘నిన్ను నువ్వు తెలుసుకో.. అనేది అని మతాలలోని మూల సారాంశం. భగవంతుడు ఎక్కడో కాదు, నీలోనే ఆత్మగా ఉన్నాడు. ఇది సత్యం. ఈ సత్యాన్వేషణ... సహజయోగంలోని ఆత్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది’’ అని ఆమె చెపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహజయోగులందరూ అందరూ అన్ని మతాల దైవాలను, ప్రవక్తలను... ‘అందరూ ఒక్కటే’ అనే భావనతో ఆరాధిస్తారు. కులమతాలకు అతీతంగా జరిపిన సహజయోగ వివాహాల ద్వారా వసుధైక కుటుంబానికి అసలైన నిర్వచనాన్ని శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆచరణాత్మకంగా చూపించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో, అమెరికా, ఇటలీ, కెనడాల్లో సహజయోగ ఇంటర్నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ స్థాపించి... అన్ని వర్గాల విద్యార్థులకు క్రమ శిక్షణతో, పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యను అందేలా దోహదం చేశారు. మన దేశమంతటా పర్యటించి... విద్యార్థులకు, ఉద్యోగులకు, గృహిణులకు వారి సమస్యలకు పరిష్కారంగా సహజయోగను ఉచితంగా బోధించారు. ఈ కార్యక్రమం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అలాగే సహజయోగ ద్వారా పొందే ప్రకంపనల సహాయంతో... సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని, ఆరోగ్యమైన పంటలను పండించే విధానాన్ని రైతులకు సహజయోగులు ఉచితంగా బోధిసున్నారు. భగవంతుని శక్తితో తమను అనుసంధానపరచుకొని... ధ్యానం ద్వారా తమను సమతుల్యతతో ఎలా ఉంచుకోవాలో, సమస్యలను స్వయంగా ఎలా పరిష్కరించుకోవడం, మత్తు పదార్థాల వ్యసనాలను వదులుకోవడం లాంటివి సహజయోగులు తెలుసుకొంటున్నారు. తమ జీవితాలను ఆనందంగా మలచుకొంటున్నారు.


సత్యావిష్కరణ...

మానవులు ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో జన్మల నుంచి అన్వేషిస్తున్న సత్యాన్ని... సహజయోగ ధ్యానం ద్వారా శ్రీమాతాజీ నిర్మలాదేవి ఆవిష్కరించారు. ఎలాంటి స్వార్థ చింతనా లేకుండా మానవాళికి అందించారు. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా... తన సొంత డబ్బుతో వివిధ దేశాలు పర్యటించారు. సహజయోగాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఈ విధంగా తన జన్మను సార్థకం చేసుకున్న ఆమె... 2011 ఫిబ్రవరి 23న తన సాకార రూపాన్ని చాలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని... ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీని ‘బ్రహ్మ చైతన్య దినోత్సవం’గా... ప్రపంచంలోని అన్ని సహజయోగ కేంద్రాలలో నిర్వహిస్తారు.

(23న బ్రహ్మ చైతన్య దినోత్సవం)

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ


ఇవి కూడా చదవండి:

Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 04:53 AM