ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bridal Fashion: ఝుంకామెరుపుల్‌

ABN, Publish Date - Feb 11 , 2025 | 10:46 PM

దక్షిణ భారత మూలాలు కలిగిన సంప్రదాయ ఆలయ ఆభరణాలైన ఝంకాలు గుడి గంట ఆకారంలో తయారవుతూ ఉంటాయి. ఆకారంలో పెద్దవిగా, బరువుగా ఉండే ఈ ఆభరణాలు కాలక్రమేణా కొత్త హంగులు అద్దుకుంటూ వినూత్నమైన డిజైన్లతో రూపొందడం మొదలుపెట్టాయి.

చెవులకు చిట్టిపొట్టి పోగులు ధరించే రోజులు పోయాయి. ఇప్పుడంతా భారీ ఝంకాల ఫ్యాషనే! పెళ్లిళ్ల సీజన్లో ఇలాంటి భారీ ఝుంకాలకు గిరాకీ ఎక్కువ. కాబట్టి తాజాగా మహిళలను ఆకట్టుకుంటున్న ఈ ఫ్యాషన్‌ గురించి తెలుసుకుందామా?

దక్షిణ భారత మూలాలు కలిగిన సంప్రదాయ ఆలయ ఆభరణాలైన ఝంకాలు గుడి గంట ఆకారంలో తయారవుతూ ఉంటాయి. ఆకారంలో పెద్దవిగా, బరువుగా ఉండే ఈ ఆభరణాలు కాలక్రమేణా కొత్త హంగులు అద్దుకుంటూ వినూత్నమైన డిజైన్లతో రూపొందడం మొదలుపెట్టాయి. ప్రారంభంలో దక్షిణ భారత దేశంలోని భరతనాట్య కళాకారిణులు చంప సరాలతో కలిపి వీటిని ధరించడం మొదలుపెట్టారు. ప్రాంతాన్ని బట్టి భిన్నమైన పేర్లను పొందిన ఈ ఆభరణాలను రాజస్థాన్‌లో మీనాకారి ఝుంకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఇవి పూలు, నెమలి డిజైన్లతో రూపొందుతూ ఉంటాయి. బంగారం, వెండి, వజ్రాలతో రూపొందే ఝుంకాలు వేర్వేరు పరిమా ణాలు, డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


వేర్వేరు నమూనాల్లో...

గుండ్రని, గంటాకారపు, చంద్రాకారపు, శంఖాకార ఝుంకాలు తయారవుతూ ఉంటాయి. వీటిలో పెద్దవీ, చిన్నవీ ఉంటాయి. అయితే ఆకారంలో పెద్దవిగా ఉండే వాటిని అన్ని సందర్భాల్లో ధరించడం వీలు కాదు కాబట్టి వాటిని స్టడ్‌గా, ఝంకాగా వేర్వేరుగా విడదీసే వీలుండే డిటాచబుల్‌ నమూనాలు కూడా దొరుకుతున్నాయి. వీటికి మ్యాచ్‌ అయ్యే చంపసరాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి పెళ్లిళ్లు లాంటి వేడుకల్లో భారీ ఝుంకాలనూ, రోజువారీ వాడుక కోసం తేలికపాటి ఝుంకాలను ఎంచుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంప్రదాయ వేడుకల్లో టెంపుల్‌ జ్యువెలరీ విభాగానికి చెందిన ఝుంకాలు చాలా బాగుంటాయి.

నప్పేవాటిని ఎంచుకుని...

ఝుంకాలు భారీగా ఉన్నప్పుడు మెడలో తేలికపాటి ఆభరణాలు ధరించాలి. మెడలో వేసుకునే నెక్లెస్‌ లేదా చోకర్‌ భారీగా ఉన్నప్పుడు తేలికపాటి ఝుంకాలు పెట్టుకోవాలి. అలాగే వస్త్రధారణను బట్టి అందుకు తగిన ఝుంకాలను ఎంచుకుంటూ ఉండాలి. ఇలా వేడుక, సందర్భం, వస్త్రధారణల ఆధారంగా తగిన ఝుంకాలను ధరిస్తే చూపరులను ఇట్టే ఆకట్టుకోవచ్చు.

Updated Date - Feb 11 , 2025 | 10:50 PM