ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kanchipuram saree : శ్వేత సౌధంలో కాంచీపురం ధగధగలు

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:36 AM

అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరైన నీతా అంబానీ, ఎప్పటిలాగే భారతీయ సంప్రదాయం ఉట్టిపడే వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ వేడుక సందర్భంగా ఆమె ఎంచుకున్న కాంచీపురం పట్టుచీర, 18వ శతాబ్దం నాటి

అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరైన నీతా అంబానీ, ఎప్పటిలాగే భారతీయ సంప్రదాయం ఉట్టిపడే

వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ వేడుక సందర్భంగా

ఆమె ఎంచుకున్న కాంచీపురం పట్టుచీర, 18వ శతాబ్దం నాటి

వారసత్వ ఆభరణాల సొగసుల విశేషాలు ఈ వారం ఫ్యాషన్‌ ప్రత్యేకం!

వారసత్వ సంపద ఉట్టిపడేలా...

కాంచీపురం ఆలయ వైభవాలకు అద్దం పట్టే, వందకు పైగా ప్రత్యేక మోటి్‌ఫ్సతో రూపొందిన కాంచీపురం పట్టుచీర, 18వ శతాబ్దం నాటి వారసత్వ ఆభరణాలు ధరించి... భారతీయ సంప్రదాయ వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ఘనంగా ఆవిష్కరించారు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ. జాతీయ అవార్డు విజేత, చేనేత కళాకారుడు బి.కృష్ణమూర్తి రూపొందించిన ఈ చీరలో ఇరుతలైపాక్షి (విష్ణువును సూచించే రెండు తలల గద్ద), మయిల్‌ (అమరత్వం, దైవత్వానికి సూచన), భారతీయ జానపద కథల విశిష్ఠత) పౌరాణిక సొర్గవాసల్‌ జంతు బాటలతో కూడిన సూక్ష్మమైన, క్లిష్టమైన మోటిఫ్స్‌ ఉన్నాయి. ఈ అద్భుతమైన చీరకు తనదైన శైలిలో రూపొందించిన వెల్వెట్‌ బ్లౌజ్‌తో ప్రముఖ డిజైనర్‌ సమకాలీన హంగును జోడించడం మరొక విశేషం.


విలువైన జాతి రాళ్లతో...

కాంచీపురం చీరలు విలాసవంతమైన, అత్యంత అద్భుతమైన కళాకృతులు. వీటికి సరిజోడుగా ఎంచుకునే ఆభరణాలు కూడా అంతే హుందాతనాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కాబట్టే 200 ఏళ్లనాటి అరుదైన భారతీయ శైలితో రూపొందిన ఆభరణాలను ఎంచుకున్నారు నీతా అంబానీ. పచ్చలు, గోమేధికాలు, వజ్రాలు, ముత్యాలు పొదిగిన చిలుక ఆకారంలో కుందన్‌ శైలిలో రూపొందిన పెండెంట్‌ను ఆమె ధరించారు. నలుపు రంగు కాంచీపురం చీర, పాతకాలపు నగలతో, నీతా అంబానీ వేడుకలో మెరిసిపోయారు. కాంచీపురం చీరలు ప్రత్యేకించి సంప్రదాయ వేడుకలకు ఎంతో బాగా నప్పుతాయి. ప్రస్తుతం మార్కెట్లో కాంచీపురం చీరలు వినూత్నమైన డిజైన్లలో రూపొందుతున్నాయి. కలకాలం వన్నె తరగని ఈ పట్టుచీరల మిలమిలల ముందు ఎంతటి ఆధునిక వస్త్రధారణ అయినా దిగదుడుపే!

Updated Date - Jan 22 , 2025 | 01:36 AM