ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజి తాగుదాం..!

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:36 AM

గంజి సహజ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....

గంజి సహజ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • గంజిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం చేసిన తరవాత, నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాసు గంజి తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

  • ప్రతిరోజూ గంజి తాగడంవల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మలబద్దకం దూరమవుతుంది. పొట్ట సమస్యలు రావు.

  • వేసవికాలంలో తరచూ గంజి తాగుతూ ఉంటే వడదెబ్బ తగలదు. ఒక గ్లాసు గంజిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. డయేరియాను నిరోధిస్తుంది.


  • గంజిలో బి 1, బి 2, బి 6 విటమిన్లతోపాటు మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి జీవక్రియలను వేగవంతం చేయడంతోపాటు మెదడు పనితీరుని క్రమబద్దీకరిస్తాయి.

  • గంజి తాగడం వల్ల చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, గుల్లలు రాకుండా ఉంటాయి. శిరోజాలు చక్కగా పెరుగుతాయి.

  • గంజిలో ఉండే పోటాషియం శరీరంలో సోడియం స్థాయిని నియంత్రిస్తుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.

  • గంజిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు గంజి తాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.



Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 05:36 AM