రక్తదానం చేస్తే...
ABN, Publish Date - Mar 10 , 2025 | 06:02 AM
రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడడమే కాకుండా రక్తదాతకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణలు చెబుతున్నారు...
రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడడమే కాకుండా రక్తదాతకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని నిపుణలు చెబుతున్నారు.
రక్తదానం చేస్తున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. వీటివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
రక్తదానం చేసినవెంటనే శరీరంలో కొత్త రక్తకణాల ఉత్పత్తి ప్రారంభమౌతుంది. మెదడు నుంచి పాదాల వరకూ రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది.
రక్తదానం చేయడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒంటరితనం అనే భావన తొలగిపోతుంది. మానసిక సంతృప్తి లభిస్తుంది.
రక్తదానం చేస్తే శరీరంలో పేరుకున్న అదనపు ఇనుము బయటికి వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల అవయవాల పనితీరు సక్రమంగా మారుతుంది.
రక్తదానం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రావు. గుండె, రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది.
పద్దెనిమిది నుంచి ఆరవై ఏళ్ల వయసు ఉన్న ఆరోగ్యవంతులంతా రక్తదానం చేయవచ్చు. చెడు అలవాట్లు, హెపటైటిస్- బి/సి, హెచ్‌ఐవీ, అధిక రక్తపోటు ఉన్నవారు రక్తదానం చేయడానికి వీలు లేదు. ఒకసారి రక్తదానం చేస్తే దాంతో ముగ్గురికి ప్రాణదానం చేసే వీలుంది.
రక్తదానం చేసేటప్పుడు గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు స్వల్పంగా పెరగవచ్చు. కాబట్టి వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. రక్తదానం చేసిన తరవాత రెండు రోజుల వరకూ వ్యాయామం చేయకూడదు.
Updated Date - Mar 10 , 2025 | 06:02 AM