ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity Bill : కరెంట్‌ బిల్‌ని ఇలా తగ్గించుకోండి..!

ABN, Publish Date - Feb 05 , 2025 | 11:29 PM

వేసవికాలం వస్తోంది అనగానే అందరిలో కరెంట్‌ బిల్‌కు సంబంధించిన ఆందోళన ప్రారంభమౌతుంది. ఇంట్లో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి చిన్న జాగ్రత్తలు పాటిస్తే... కరెంట్‌ బిల్‌ భారీగా పెరగకుండా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలసుకుందాం.

వేసవికాలం వస్తోంది అనగానే అందరిలో కరెంట్‌ బిల్‌కు సంబంధించిన ఆందోళన ప్రారంభమౌతుంది. ఇంట్లో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి చిన్న జాగ్రత్తలు పాటిస్తే... కరెంట్‌ బిల్‌ భారీగా పెరగకుండా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలసుకుందాం.

  • ఎల్‌ఈడీ బల్బుల వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. ఇంట్లోని ప్రతిగదిలో ట్యూబ్‌లైట్‌తోపాటు ఎల్‌ఈడీ బల్బును కూడా ఏర్పాటు చేసుకోవడం మంచిది. పిల్లలు చదువుకునేటప్పుడు ట్యూబ్‌లైట్‌ను మిగిలిన అన్ని సందర్భాల్లో ఎక్కువగా ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించడం వల్ల కొంతమేర కరెంట్‌ బిల్లు తగ్గించుకోవచ్చు.

  • వేసవికాలంలో చాలామంది ఇళ్లలో ఏసీని ఉపయోగిస్తూ ఉంటారు. ఏసీ వేసేముందు కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఏసీని 26 డిగ్రీల వద్ద ఉంచి గది మొత్తం చల్లగా అయిన తరవాత ఆపివేయాలి. నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీకి బదులు ఇన్వర్టర్‌ ఏసీని ఎంచుకోవడం మంచిది. ఇన్వర్టర్‌ ఏసీ......అవసరం మేరకు కంప్రెసర్‌ వేగాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల ఎక్కువగా విద్యుత్‌ వినియోగం కాదు. కరెంట్‌ బిల్‌ కూడా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఏసీకి బదులు కూలర్‌ వాడుకోవడం మేలు.

  • హాల్‌, లివింగ్‌ రూమ్‌, స్టడీరూమ్‌ ఇలా ప్రతి గదిలో అవసరమైనప్పుడు మాత్రమే ఫ్యాన్‌ వేసుకోవాలి. గది నుంచి బయటికి వస్తూ ఫ్యాన్‌ని ఆపివేయడం మర్చిపోవద్దు. ఈ అంశానికి సంబంధించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించడం మంచిది. దుమ్ము, ధూళి పేరుకుంటే ఫ్యాన్‌ ఎక్కువ విద్యుత్‌ని వినియోగించుకుంటుంది. వారానికి ఒకసారి ఇంట్లోని ఫ్యాన్లను తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

  • మైక్రోవేవ్‌ ఎక్కువగా విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. దీనిని ఉపయోగించుకున్న తరవాత వెంటనే పవర్‌ బటన్‌ను ఆపివేయాలి. అలాగే స్టాండ్‌బై మోడ్‌లో ఉంచకూడదు.

  • ఫ్రిజ్‌ వాడకంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రీజర్లో ఎక్కువగా ఐస్‌ గడ్డకడితే విద్యుత్‌ ఎక్కువగా వినియోగమవుతుంది. మూడు రోజులకు ఒకసారి ఫ్రిజ్‌ను పరిశీలించి డీఫ్రాస్ట్‌ చేయాలి. ఫ్రిజ్‌ కొనేటప్పుడు ఎక్కువ స్టార్లు ఉన్నది తీసుకోవాలి. ఐదు స్టార్లు ఉంటే... విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉంటుంది.

  • గీజర్‌లో నీటిని వేడిచేసిన వెంటనే స్నానాదికాలు ముగించాలి. ఇంట్లో పెద్ద గీజర్‌ ఉంటే అందులో నీటిని ఒకేసారి వేడిచేసి కుటుంబసభ్యులంతా ఒకరి తరవాత ఒకరు స్నానం ముగించేలా చూసుకోవాలి.

  • వాషింగ్‌ మెషిన్‌లో సూచించిన లోడ్‌కు తగ్గట్టు దుస్తులు వేయాలి. అంతకు మించి వేస్తే విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది.

Updated Date - Feb 05 , 2025 | 11:29 PM