Screen time : స్ర్కీన్ టైమ్ తగ్గించాలంటే...
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:25 PM
మొబైల్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ స్ర్కీన్ టైమ్ పెరిగిపోయింది. దీంతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ర్కీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం!
మొబైల్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో డిజిటల్ స్ర్కీన్ టైమ్ పెరిగిపోయింది. దీంతో శారీరక, మానసిక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ స్ర్కీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం!
నోటిఫికేషన్ ఆప్షన్‌ను సెట్‌చేసి పెట్టుకోవడం వల్ల అవి వచ్చిన ప్రతిసారీ చేస్తున్న పనిని ఆపి మొబైల్ చూడాలనిపిస్తుంది. అందుకే పని పూర్తయ్యే వరకూ ఈ ఆప్షన్‌ను ఆపి ఉంచుకోవడం మంచిది. దీంతో ఏకాగ్రతగా పనిచేసుకోగల్గుతాం.
రంగులతో డిస్‌ప్లే ఉంటే తరచూ మొబైల్ చూడాలనిపిస్తుంది. అదే బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లోకి మారిస్తే మనకు తెలియకుండానే మొబైల్ నుంచి ధ్యాస మళ్లుతుంది.
భోజనం చేసే సమయంలో, రాత్రి పడుకునేటప్పుడు మొబైల్‌ను సాధ్యమైనంత దూరంలో ఉంచాలి. కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కలవారితో మాట్లాడుతూ ఉంటే మొబైల్ గుర్తుకు రాదు.
ప్రతి రోజూ కొంత సమయాన్ని డిజిటల్ బ్రేక్‌గా నిర్ణయించుకుని అనుసరించాలి. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప మొబైల్‌ను ముట్టుకోవద్దు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
రాత్రిపూట మొబైల్‌లో అలారం సెట్ చేయవద్దు. దీనికోసం గడియారాన్ని ఉపయోగించడం మంచిది. బెడ్‌రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉంచవద్దు.
తరచూ వార్తాపత్రికలు, లేదా పుస్తకాలు చదువుతూ ఉంటే మొబైల్ చూసే అలవాటు నుంచి బయటపడవచ్చు. దీనివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువగా రీల్స్, ఫొటోలు, మెసేజ్‌లు షేర్ చేసేవారిని మ్యూట్‌లో పెడితే కొంతవరకూ ప్రయోజనం ఉంటుంది.
ఇష్టమైన మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, పిల్లలతో కలిసి ఆటలాడడం, వ్యాయామం చేయడం, ధ్యానం, నడక, గార్డెనింగ్ లాంటివి అలవాటు చేసుకుంటే డిజిటల్ స్ర్కీన్ టైమ్‌ని తగ్గించుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..
Updated Date - Feb 16 , 2025 | 11:25 PM