ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cholesterol control : కొలెస్ట్రాల్‌ను ఇలా నియంత్రిద్దాం

ABN, Publish Date - Jan 28 , 2025 | 12:32 AM

మనం రోజును ఎలా మొదలుపెడుతున్నామనేదాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు మన రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాదులను నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో తెలుసుకుందాం!

మనం రోజును ఎలా మొదలుపెడుతున్నామనేదాని మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు మన రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాదులను నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో తెలుసుకుందాం!

నిమ్మ రసంతో: రోజును గోరువెచ్చని నిమ్మరసంతో మొదలుపెట్టాలి. ఈ నటితో కొవ్వులు కరగడం మొదలుపెడతాయి. విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన నిమ్మరసం చెడు కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గించి, గుండె రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా సహాయపడుతుంది. నిమ్మరసం తాగడం వల్ల రోజంతా శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోకుండా ఉంటుంది.

పీచు పదార్థం: ఉదయం తీసుకునే అల్పాహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్‌, షియా విత్తనాలు, యాపిల్స్‌, అరటి పండ్లు, ఆహారంలోని కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించుకోకుండా నిలువరిస్తాయి. ఈ అలవాటులో చెడు కొలెస్ట్రాల్‌ శోషణ తగ్గడంతో పాటు, ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది.

నట్స్‌: ఉదయం, గుప్పెడు బాదం, వాల్‌నట్స్‌, అవిసెగింజలను తీసుకోవడం ఆరోగ్యకరం. వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అత్యధిక సాంద్రతతో కూడిన లైపొప్రొటీన్‌ కొలెస్ట్రాల్‌ను మెరుగు పరుస్తాయి. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్‌ను కుంటుపరుస్తాయి. అయితే అధిక క్యాలరీలు కలిగి ఉండే ఈ నట్స్‌ను పరిమితంగానే తీసుకోవాలి.


ఒత్తిడి కొలెస్ట్రాల్‌ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించే ధ్యానం, యోగా ఉదయాన్నే సాధన చేయాలి. కొన్ని నిమిషాల ధ్యానం ఒత్తిడిని తగ్గించి, మానసిక స్పష్టతను సమకూరుస్తుంది. అలాగే శ్వాస వ్యాయామాలకు కూడా ఉదయాన్నే కేటాయించాలి.

ఉదయం తీసుకునే అల్పాహారంలో మాంసకృత్తులు, పీచు ఎక్కువగా పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకూ తీపికి దూరంగా ఉండాలి. పరగడుపున, కాఫీ, టీలకు బదులుగా గోరువెచ్చని నీళ్లు తాగాలి.


Also Read: లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో పుట్టిన పిల్లలకు ఆ హక్కు: సీఎం సంచలన వ్యాఖ్యలు

Also Read: కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..

Updated Date - Jan 28 , 2025 | 12:32 AM