ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Milk Benefits: వీటిని కలుపుకొని తాగితే...

ABN, Publish Date - Feb 20 , 2025 | 04:41 AM

ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో ఉండే కొన్ని దినుసులను కలుపుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు సమకూరుతాయని సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే జీర్ణ సమస్యలు రావు. కీళ్ల నొప్పులు, వాపులు కూడా తొందరగా తగ్గుతాయి.

గ్లాసు పాలలో ఒక చెంచా తేనె కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి కలుపుకుని తాగితే పేగుల్లో అనారోగ్య సమస్యలు రావు. మలబద్దకం తీరుతుంది.

చిన్న అల్లం ముక్కను తీసుకుని కచ్చాపచ్చాగా దంచి గ్లాసు పాలలో వేసి మరిగించాలి. ఈ పాలను రాత్రి పడుకునే ముందు తాగితే జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలు, కీళ్లవాతం లాంటి సమస్యలు దరిచేరవు.


ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు కుంకుమ పువ్వు రేకులు వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. పాలు బంగారు వర్ణంలోకి మారినతరవాత తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

గ్లాసు పాలలో పావు చెంచా మిరియాల పొడి వేసుకుని తాగితే గొంతు మంట, దగ్గు తగ్గుతాయి.

ఒక అంగుళం పొడవున్న దాల్చిన చెక్క ముక్కను కచ్చాపచ్చాగా దంచి ఒక గ్లాసు పాలలో వేసి రెండు నిమిషాలు మరిగించి తాగితే అధిక బరువు తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.



ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:41 AM