Coconut oil : రోజూ కొబ్బరినూనె తీసుకొంటే...
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:36 AM
కీటై డైట్‌లో కొబ్బరినూనె ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఈ డైట్‌ను అనుసరించలేని వాళ్లు కొబ్బరినూనెతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవాలంటే ప్రతి రోజూ ఒక టీస్పూను కొబ్బరినూనె తీసుకోవచ్చు. కొబ్బరినూనె ఎందుకంటే...

కొబ్బరినూనెలో మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఉంటాయి. వీటిలో శక్తి వేగంగా ఖర్చవడంతో పాటు, కొవ్వు కూడా త్వరితంగా కరుగుతుంది
పేగుల్లోని హానికారక బ్యాక్టీరియాను సంహరించి, పోషక శోషణను పెంచి, పేగుల ఆరోగ్యాన్ని పెంచే శక్తి కొబ్బరినూనెకు ఉంటుంది
చర్మం తేమతో, మెరుపులీనుతూ ఉండడానికి అవసరమైన కొవ్వులు కొబ్బరి నూనెలో ఉంటాయి.
కొబ్బరినూనెలోని మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. దాంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
కొబ్బరినూనెలో యాంటీబ్యాక్టీరియాల్ గుణాలు కలిగిన లారిక్ యాసిడ్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
ఆకలిని తగ్గించి, కడుపు నిండిన భావనకు లోను చేసి, అవసరానికి మించిన ఆహారం జోలికి వెళ్లకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉంటాయి.
Updated Date - Jan 28 , 2025 | 12:36 AM