Healthy sleep : మంచి నిద్ర కోసం...
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:33 AM
రోజంతా ఎన్నో పనులతో శరీరం అలసిపోతూ ఉంటుంది. అలసట తీరి అవయవాలన్నీ విశ్రాంతి పొందాలంటే శరీరానికి మంచి నిద్ర అవసరం. ప్రతిరోజూ కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. నిద్ర బాగా పట్టాలంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం!
రోజంతా ఎన్నో పనులతో శరీరం అలసిపోతూ ఉంటుంది. అలసట తీరి అవయవాలన్నీ విశ్రాంతి పొందాలంటే శరీరానికి మంచి నిద్ర అవసరం. ప్రతిరోజూ కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రించడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. నిద్ర బాగా పట్టాలంటే ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం!
తేనె : ప్రతిరోజూ పడుకునేముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగాలి. తేనెలో ట్రిప్టోపాన్ అనే అమైనోయాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో శరీరంలోని హార్మోన్లు ప్రేరేపితమై గాఢంగా నిద్ర వస్తుంది.
అరటిపండు : మధ్యరాత్రి వేళల్లో కొంతమందికి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. తరవాత నిద్ర పట్టక అవస్థ పడుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో బాగా పండిన అరటిపండు తింటే వెంటనే నిద్ర పడుతుంది.
బీన్స్ : వీటిలో బి 6, బి 12 విటమిన్లతోపాటు మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి నిద్రను ప్రేరేపిస్తాయి. రాత్రి భోజనంలో బీన్స్‌ను కూర రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
కివి : ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్లు, పీచుపదార్థాలు, పొటాషియంతోపాటు కె, సి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఫలితంగా మెదడు విశ్రాంతి పొందుతూ నిద్ర వచ్చేలా చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు, వృద్ధులు ప్రతిరోజూ ఒక కివి పండును తింటూ ఉంటే నాలుగు వారాల్లో సమస్యను అధిగమించవచ్చు.
గసగసాల పాలు : ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా గసగసాలు వేసి పావు గంట నానబెట్టండి. స్టవ్ మీద గిన్నెపెట్టి ఒక గ్లాసు పాలు పోసి వేడిచేయండి. ఇందులో నానిన గసగసాలు వేసి బాగా మరిగించండి. అయిదు నిమిషాల తరవాత స్టవ్ మీది నుంచి పాలను దించి వడకట్టి కొద్దిగా బెల్లం కలుపుకుని తాగండి. అరగంటలో మంచి నిద్ర వస్తుంది. ఉదయం లేవగానే ప్రశాంతంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది.
బాదం : రాత్రి పడుకునేముందు అయిదు బాదం పప్పులు తింటే హాయిగా నిద్ర పడుతుంది. బాదాంలో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇవి శరీరంలోని కండరాలు విశ్రాంతి పొందేలా చేస్తాయి. దీంతో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తయి శరీరాన్ని నిద్రకు సిద్దం చేస్తుంది. అలాగే వాల్‌నట్స్, ఓట్స్, గుమ్మడి గింజలు, చెర్రీలు మంచి నిద్రను ప్రేరేపిస్తాయి.
అశ్వగంధ పాలు : అశ్వగంధ మంచి ఆయుర్వేద ఔషధం. ఇందులో మత్తును కలిగించే ట్రై ఇథైల్ గ్లైకాల్ ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర చెంచా అశ్వగంధ పొడి కలుపుకుని తాగితే వెంటనే నిద్ర వస్తుంది. ఒత్తిడి, ఆందోళన, అలసట తగ్గిపోతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
చామంతి టీ : చామంతి టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ నిద్ర వచ్చేలా చేస్తాయి. ఒక కప్పు వేడి నీటిలో ఒక చామంతి టీ బ్యాగ్ వేసి రెండు నిమిషాలు ఉంచండి. తరవాత ఈ గోరువెచ్చని టీని మెల్లగా తాగండి. పావు గంటలో మంచి నిద్ర పడుతుంది.
ఇవి కూడా చదవండి
Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 05:33 AM