విదేశీ విద్యకి బెస్ట్ కన్సల్టెన్సీలు
ABN, Publish Date - Mar 03 , 2025 | 01:30 AM
గ్రాడ్యుయేషన్ వరకు మన దేశంలో చదివినా, ఉన్నత విద్య మాత్రం విదేశాల్లో చదువుకుని కెరీర్‌లో గొప్పగా స్థిరపడాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. దీని వల్ల చాలా ఉపయోగాలు...
గ్రాడ్యుయేషన్ వరకు మన దేశంలో చదివినా, ఉన్నత విద్య మాత్రం విదేశాల్లో చదువుకుని కెరీర్‌లో గొప్పగా స్థిరపడాలనేది చాలా మంది విద్యార్థుల కోరిక. దీని వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి.
కొత్త సంస్కృతులు పరిచయం అవుతాయి, కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. అందుకే మన దేశంలో ప్రతీ సంవత్సరం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య దినదిన ప్రవర్ధమానం అవుతోంది. అయితే ఉన్నత విద్యకు ఏయే దేశాలు- యూనివర్సిటీలు మంచివి, ఎంత ఖర్చు అవుతుంది, వీసా కోసం ఏయే పత్రాలు అవసరం అవుతాయి, ప్రాసెసింగ్ ఎలా చేయించుకోవాలి అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. విదేశీ విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సహకరించడానికి మన దగ్గర ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. వీటిని సంప్రదిస్తే సరైన గైడెన్స్ లభిస్తుంది.
తరువాత సులువుగా కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు.
కొవిడ్ ముందుతో పోలిస్తే తరువాత విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 52 శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సంలో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యార్థుల సంఖ్య 8,94,783. ప్రపంచ వ్యాప్తంగా చైనా తరువాత ఉన్నత విద్య కోసం అత్యధికంగా విదేశాలకు వెళుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మన విద్యార్థుల ప్రాధాన్యంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలు వరుసగా ఉన్నాయి. యూఎస్ సిటిజన్‌షి్‌ప అండ్ ఇమ్మిగ్రేషన్ నివేదిక ప్రకారం 2023-24 అకడమిక్ ఇయర్‌లో అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్య 3,37,630. అయితే కెనడా ఇబ్బందుల కారణంగా ఈ విద్యా సంవత్సరం అక్కడికి వెళుతున్న భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇంత పెద్ద మొత్తంలో విదేశాలకు వెళుతున్న విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న కన్సల్టెన్సీల సేవల పొందుతున్నారు.
భారతదేశంలో పేరున్న కన్సల్టెన్సీల్లో ఇవికొన్ని...
ఐడీపీ ఎడ్యుకేషన్
ఐదు దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ సర్వీసులో ఉన్న పెద్ద సంస్థ ఇది. ఆస్ట్రేలియన్ ఆసియన్ యూనివర్సిటీస్ కో-ఆపరేషన్‌గా మొదలై కాలక్రమంలో ‘ఐడీపీ ఎడ్యుకేషన్’ పేరు మార్చుకుంది. విదేశీ విద్య టకు సంబంధించి పలు సేవలు అందిస్తుంది. www.idp.com/india/
ఇన్ఫినిటీ గ్రూప్
ఇన్ఫినిటీ గ్రూప్ రెండు దశాబ్దాలకుపైగా ఎడ్యుకేషన్ సర్వీస్‌లో ఉంది. ఈ సెక్టార్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ‘ఇన్ఫినిటీ’కి 300 యూనివర్సిటీ పార్టనర్‌షిప్, 2500 గ్లోబల్ పార్ట్‌నర్స్ ఉన్నారు. స్టడీ అబ్రాడ్ కౌన్సెలింగ్, యూనివర్సిటీ సెలెక్షన్, అప్లికేషన్ అసిస్టెన్స్, వీసా గైడెన్స్, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్, ఎండ్ టు ఎండ్ అసిస్టెన్స్‌లో ఉంటుంది. https://infinitegroup.global/
వై యాక్సిస్
భారతదేశంలోని పేరొందిన నమ్మకమైన స్టడీ అబ్రాడ్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీల్లో ‘వై యాక్సిస్’ ఒకటి. 25 సంవత్సరాల పైన ఈ సంస్థ కన్సల్టెన్సీ సర్వీసులో ఉంది. స్టడీ అబ్రాడ్, ఇమ్మిగ్రేషన్ కౌన్సెలింగ్, వీసా అసిస్టెన్స్, కెరీర్ కౌన్సెలింగ్, లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ‘వై యాక్సిస్’ సహాయం చేస్తుంది. https://www.yaxis.com/
ఎడ్విన్ ఇంటర్నేషనల్
‘ఎడ్విన్ ఇంటర్నేషనల్’ మూడు దశాబ్దాలకుపైగా ఎడ్యుకేషన్ సర్వీస్‌లో ఉంది. దేశంలోని పాత కన్సల్టెన్సీలో ఇది ఒకటి. స్టడీ అబ్రాడ్ కౌన్సెలింగ్, యూనివర్సిటీ సెలెక్షన్, అప్లికేషన్ అసిస్టెన్స్, వీసా గైడెన్స్, ప్రి డిపార్చర్ ఓరియంటేషన్ నిర్వహిస్తుంది. స్కాలర్‌షిప్స్, ఫైనాన్సియల్ ఎయిడ్‌కు సంబంధించిన సమాచారం కూడా ఇస్తుంది. https://www.edwiseinternational.com/
‘మాన్య గ్రూప్’(ద ప్రిన్స్‌టన్ రివ్యూ ఇండియా)
దేశంలోని ఎస్టాబ్లిష్డ్ కన్సల్టెన్సీలో ‘మాన్య గ్రూప్’ ఒకటి. రెండు దశాబ్దాలకు పైగా ఎడ్యుకేషన్ సర్వీసె్‌సలో రెప్యూటెడ్ గ్రూప్ ఇది. పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, సంస్థలతో పార్ట్‌నర్‌షిప్ కొనసాగిస్తోంది. స్టడీ అబ్రాడ్ కౌన్సెలింగ్, శాట్/ఏసీటీ/జీఆర్‌ఈ/జీమాట్/ ఐఈఎల్‌టీఎస్/ టోఫెల్ ప్రిపరేషన్, లాంగ్వేజ్ ట్రైనింగ్, కెరీర్ కౌన్సెలింగ్ తదితరాలు నిర్వహిస్తుంది. https://www.manyagroup.com/
కెరీర్ మాట్రిక్స్
ఒకటిన్నర దశాబ్దం పైగా ఎడ్యుకేషన్ సర్వీసె్‌సలో ఉన్న సంస్థ ఇది. పలు యూనివర్సిటీలు, సంస్థలతో పార్ట్‌నర్‌షిప్ ఉంది స్టడీ అబ్రాడ్ కౌన్సెలింగ్, యూనివర్సిటీ సెలెక్షన్, అప్లికేషన్ అసిస్టెన్స్, వీసా గైడెన్స్, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ నిర్వహిస్తుంది.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
Updated Date - Mar 03 , 2025 | 01:31 AM