Skincare : ముఖాన్ని ఇలా మెరిపించండి!
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:24 AM
ముఖం అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. రసాయనభరితమైన సౌందర్య సాధనాలు కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే ప్యాక్ తయారుచేసుకుని వాడితే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఆ వివరాలు...
ముఖం అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. రసాయనభరితమైన సౌందర్య సాధనాలు కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే ప్యాక్ తయారుచేసుకుని వాడితే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఆ వివరాలు...
పండిన అరటిపండును తొక్కతీసి చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయాలి. చెంచాతో వాటిని గుజ్జులా చేయాలి. అందులో రెండు చెంచాల పాలు, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మానికి తేమ అంది సహజసిద్దంగా మెరుస్తుంది.
ఒక గిన్నెలో ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా గులాబీ నీళ్లు, ఒక చెంచా బంగాళదుంప రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని కింది నుంచి పైకి రాస్తూ ముఖానికి, మెడకి పట్టించాలి. ముక్కుకు ఇరుపక్కలా, నుదుటి మీద సున్నితంగా మర్దన చేయాలి. అరగంట ఆరిన తరవాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్.... బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. నలుపుదనమంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
ఒక గిన్నెలో అయిదు చెంచాల బార్లీ గింజల పొడి వేసి అందులో గోరువెచ్చని నీళ్లు చల్లుతూ ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్దిగా తీసుకుంటూ ముఖమంతా పరచాలి. పదిహేను నిమిషాలు ఆరిన తరవాత ముని వేళ్లతో మెల్లగా రుద్దుతూ మిశ్రమాన్ని తొలగించి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు, మురికి తొలగిపోతాయి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
స్టవ్ మీద గిన్నె పెట్టి అరగ్లాసు పాలు, మూడు చెంచాల ఓట్స్ వేసి ఉడికించాలి. చల్లారిన తరవాత ఇందులో ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఇరవై నిమిషాలు ఆరిన తరవాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 27 , 2025 | 05:24 AM