ఇంటికి శోభనిచ్చే మనీ ప్లాంట్!
ABN, Publish Date - Mar 10 , 2025 | 06:00 AM
చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. ఈ తీగ అందంగా అల్లుకోవాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. ఈ తీగ అందంగా అల్లుకోవాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్‌ని ఏ సైజు కుండీలోనైనా పెంచవచ్చు. పెద్ద కుండీ అయితే ఆకులు వెడల్పుగా వస్తాయి.
గాజు సీసాలో నిండుగా నీరు పోసి అందులో ఈ మొక్కను ఉంచినా కూడా బాగా పెరుగుతుంది. పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు మారిస్తే చాలు.
ఈ మొక్కకు ఎక్కువగా ఎండ తగలకూడదు. కొద్దిగా వెలుతురు ఉంటే చాలు తీగలా చక్కగా పెరుగుతుంది.
కుండీలో తరచూ నీళ్లు పోయకూడదు. మట్టి తేమగా ఉంటే చాలు. ఆకులపై కొన్ని నీళ్లు పిచికారీ చేస్తూ ఉంటే అవి పచ్చగా మెరుస్తూ కనిపిస్తాయి.
కుండీలో మట్టికి మూడు నెలలకు ఓసారి ఆవుపేడతో తయారుచేసిన సేంద్రీయ ఎరువు కలపాలి.
మొక్క మొదళ్లలో నాచుకర్రలు పాతితే వేళ్లకు నిరంతరం తేమ అందుతూ ఉంటుంది. మొక్క పొడవుగా పెరుగుతుంది.
ఎండిన, పండిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ తీగను అందంగా అమరుస్తూ ఉంటే మొక్క పెరుగుతూనే ఉంటుంది. కుండీ మధ్యలో పొడవాటి కర్రను ఉంచి దాని చుట్టూ తీగను చుడుతూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది. చూడడానికి అందంగా కనిపిస్తుంది.
Updated Date - Mar 10 , 2025 | 06:00 AM