దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్‌లు
ABN, Publish Date - Jan 06 , 2025 | 06:40 AM
సికింద్రాబాద్‌లోని రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ ఎస్‌సీఆర్ వర్క్‌షాప్, యూనిట్‌లలో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐఐటీ పాసైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది....
దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్‌లు
సికింద్రాబాద్‌లోని రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ ఎస్‌సీఆర్ వర్క్‌షాప్, యూనిట్‌లలో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐఐటీ పాసైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్‌సీఆర్ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట్, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్.
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు:
ఏసీ మెకానిక్ - 143
ఎయిర్ కండీషనింగ్ - 32
కార్పెంటర్ - 42
డీజిల్ మెకానిక్ - 142
ఎలకా్ట్రనిక్ మెకానిక్ - 85
ఇండస్ట్రియ్ ఎలకా్ట్రనిక్స్ - 10
పెయింటర్ - 74
పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) - 34 ఎలక్ట్రీషియన్ - 1053
ఎలక్ట్రికల్(ఎ్‌సఅండ్‌టీ) (ఎలక్ట్రీషియన్) - 10 ఫిట్టర్ - 1742
ట్రైన్ లైటింగ్(ఎలక్ట్రీషియన్) - 34
మెషినిస్ట్ - 100
మోటార్ మెకానిక్ మెహికిల్ - 08
వెల్డర్ - 713
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 10
(మొత్తం పోస్టుల సంఖ్య 4232 (ఎస్సీ-635, ఎసీ-317, ఓబీసీ -1143, ఈడబ్ల్యూఎస్-423, యూఆర్-1714)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పది పాస్ కావడంతోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 2024 డిసెంబర్ 28 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఎంపిక: పది, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓబీసీలకు మూడు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
చివరి తేదీ: 2025 జనవరి 27
పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Updated Date - Jan 06 , 2025 | 06:40 AM