ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diet tips : వెన్నకు బదులుగా...

ABN, Publish Date - Jan 28 , 2025 | 12:28 AM

పరాఠా, చపాతీ, బ్రెడ్‌.... వీటికి వెన్నను జోడించి తినడం మన అలవాటు. అయితే వెన్నతో పెరిగే కొలస్ర్టాల్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే, వెన్నకు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. అందుకోసం...

పరాఠా, చపాతీ, బ్రెడ్‌.... వీటికి వెన్నను జోడించి తినడం మన అలవాటు. అయితే వెన్నతో పెరిగే కొలస్ర్టాల్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే, వెన్నకు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. అందుకోసం...

ఆలివ్‌ ఆయిల్‌

గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆలివ్‌ నూనె వెన్నకు చక్కని ప్రత్యామ్నాయం. ప్రత్యేకించి వంటల్లో, బేకింగ్‌లో ఈ నూనెను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరికే ఆలివ్‌ నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ నూనెను సలాడ్స్‌, బేకింగ్‌ కోసం వాడుకోవచ్చు. వెన్నను ఉపయోగించి వండే వంటకాల కోసం ఒక కప్పు వెన్నకు బదులుగా 3/4 కప్పు ఆలివ్‌ నూనెను వాడుకోవచ్చు.

కొబ్బరినూనె

కొబ్బరి నూనె బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆకృతిలో వెన్నను అనుకరిస్తుంది. దీన్ని వెన్నలా వాడుకోవచ్చు. బ్రెడ్‌ మీద పూసుకుని తినొచ్చు. వెన్నతో సమాన పరిమాణాల్లో బేక్‌ చేసే వంటకాల్లో వాడుకోవచ్చు. అయితే కొబ్బరి సువానన చెక్కుచెదరకుండా ఉండడం కోసం రిఫైన్‌ చేయని కొబ్బరినూనెను వాడుకోవాలి.


అవకాడొ

పోషకభరిత వెన్నకు అద్భుతమైన ప్రత్యామ్నాయం.. అవకాడొ. గుండెకు మేలు చేసే మోనోశాచురేటెడ్‌ కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు దీన్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వెన్నకు బదులుగా అవకాడొను గుజ్జును చేసి టోస్ట్‌ల మీద స్ర్పెడ్‌గా వాడుకోవచ్చు. అలాగే బ్రౌనీలు, మఫిన్ల తయారీలో కూడా వెన్నకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.

నట్‌ బటర్స్‌

బాదం, వేరుశనగ, జీవడిపప్పు బటర్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి కూడా వెన్న లాంటి ఆకృతినే కలిగి ఉండి, రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. వీటిలోని విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. కాబట్టి స్మూదీలు, బిస్కెట్ల బేకింగ్‌లలో నట్‌ బటర్స్‌ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.


Also Read: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు

Also Read: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు

Updated Date - Jan 28 , 2025 | 12:28 AM