ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DRG forces: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మహిళా కమాండోల శౌర్యం..!

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:02 AM

జనజీవన స్రవంతిలో కలిశాక.. పోలీసులుగా జిల్లా సాయుధ గార్డులు(డీఆర్‌జీ)గా సేవలందిస్తున్నారు. అలా కఠోర శిక్షణ పొందిన మహిళలు కమాండోలుగా ఆదివారం నాటి బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా..

కాల్పుల్లో పాల్గొన్న 200 మంది మహిళలు

చర్ల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వారంతా మహిళలు..! మాజీ నక్సలైట్లు..! మావోయిస్టుల సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా పనిచేసినవారు..! జనజీవన స్రవంతిలో కలిశాక.. పోలీసులుగా జిల్లా సాయుధ గార్డులు(డీఆర్‌జీ)గా సేవలందిస్తున్నారు. అలా కఠోర శిక్షణ పొందిన మహిళలు కమాండోలుగా ఆదివారం నాటి బీజాపూర్‌ జిల్లా ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా.. వీరిలో 11 మంది మహిళా నక్సల్స్‌ ఉన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన నక్సల్స్‌ సమావేశమైనట్లు ఉప్పందుకున్న 800 మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బలగాలు, బస్తర్‌ ఫైటర్స్‌ మావోయిస్టుల స్థావరానికి చేరుకోగా.. వీరిలో 200 మంది మహిళా కమాండోలు ఉన్నారు. వీరంతా క్రూరమృగాలు తిరిగే జాతీయ పార్క్‌లో.. కొండలు, గుట్టలు దాటుతూ.. చిట్టడవుల్లో నాలుగు రోజులపాటు 70 కిలోమీటర్లు నడిచారు. మందుపాతరలున్నాయా? అని గమనిస్తూ.. జాగ్రత్తగా వెళ్లారు. ఆదివారం ఉదయం 6.30 సమయంలో.. కిలోమీటర్‌ దూరంలో నక్సల్స్‌ క్యాంపు ఉన్నట్లు గుర్తించారు. ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న వేళ మహిళా కమాండోలు తోటి జవాన్లను కవర్‌ చేస్తూ.. కాల్పులతో ముందుకు సాగారు. ఎన్‌కౌంటర్‌లో మహిళా కమాండోలు కీలక పాత్ర పోషించారని ఓ జవాన్‌ మీడియాకు వివరించారు.


ఐదుగురు నక్సల్స్‌ మృతదేహాల గుర్తింపు

నేషనల్‌ పార్క్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 31 మంది మావోయిస్టుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. సోమవారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐజీ సుందర్‌రాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుల్లో 11మంది మహిళలున్నారని, ఇంకా 25 మందిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. మృతుల్లో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ డీబీసీఎం హంగాఖర్మ(రూ.8లక్షల రివార్డు), ఐదేసి లక్షల రివార్డులున్న పీపీసీఎం ప్లటూన్‌ కమాండర్‌ మంగు హేమ్లా, నేషనల్‌ పార్క్‌ ఏరియా ఏసీఎం సుభాష్‌ ఓయం, గంగులూర్‌ ఏసీఎం సన్ను, నేషనల్‌ పార్క్‌ ఏరియా సభ్యుడు రమేశ్‌(రూ.2లక్షల రివార్డు) ఉన్నట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:03 AM