SFJ: మోదీ, షాకు పన్నూన్ బెదిరింపులు
ABN, Publish Date - Jan 31 , 2025 | 05:00 AM
భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఎస్‌ఎ్‌ఫజేపై గత ఏడాది జూలై 10న చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధాన్ని పొడిగించింది.
రాజ్‌నాథ్, అజిత్ దోభాల్‌లకు కూడా..
యూఏపీఏ ట్రైబ్యునల్‌కు కేంద్రం వెల్లడి
‘సిక్స్ ఫర్ జస్టి్‌స’పై ఐదేళ్ల పాటు నిషేధ పొడిగింపునకు ట్రైబ్యునల్ సమర్థన
న్యూఢిల్లీ, జనవరి 30: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ స్థాపించిన ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (ఎస్‌ఎ్‌ఫజే) సంస్థపై నిషేఽధాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు పొడిగించడాన్ని ఢిల్లీ హైకోర్టుకు చెందిన యూఏపీఏ ట్రైబ్యునల్ సమర్థించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఎస్‌ఎ్‌ఫజేపై గత ఏడాది జూలై 10న చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధాన్ని పొడిగించింది. ఎస్‌ఎ్‌ఫజేను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయా?అనేదానిపై తీర్పునిచ్చేందుకు జస్టిస్ అనుప్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీ హైకోర్టు ట్రైబ్యునల్ ఆగస్టు 2న ఏర్పాటైంది. ఈ మేరకు ట్రైబ్యునల్ ఈ నెల 3న జారీచేసిన ఉత్తర్వులు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోదీ సహా హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌లకు ఎస్‌ఎ్‌ఫజే నుంచి బెదిరింపులు వచ్చాయని కేంద్రం తెలిపింది. పార్లమెంట్, ఎర్రకోటలపై బాంబు దాడి చేస్తామంటూ గత ఏడాది జూలై 22న వాయిస్ సందేశం పంపిందని పేర్కొంది. భారత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో ఎస్‌ఎ్‌ఫజే హస్తం ఉందని వెల్లడించింది. ప్రత్యేక ఖలిస్థానీ దేశం పేరుతో పంజాబ్‌లో వేర్పాటు భావజాలానికి మద్దతిస్తూనే ఉందని తెలిపింది. భారత దళాలపై పోరాడాలని ఆందోళనలు చేస్తున్న రైతులను పన్నూన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని కేంద్రం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 31 , 2025 | 05:00 AM