లోయలో పడిన ఆర్మీ వాహనం
ABN, Publish Date - Jan 05 , 2025 | 02:18 AM
జమ్మూకశ్మీర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహారా కాసేందుకు వెళుతున్న ఓ ఆర్మీ వాహనం బందిపొరాలోని సదర్ కూట్ పాయన్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది.
కశ్మీర్‌లో నలుగురు సైనికుల మృతి, ముగ్గురికి గాయాలు
జమ్మూ, జనవరి 4: జమ్మూకశ్మీర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహారా కాసేందుకు వెళుతున్న ఓ ఆర్మీ వాహనం బందిపొరాలోని సదర్ కూట్ పాయన్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. క్షతగాత్రులను బందిపొరా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు శ్రీనగర్‌కు తరలించారు. శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన ముగ్గురు సైనికుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.
Updated Date - Jan 05 , 2025 | 02:18 AM