ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pushpak Express: ఒక రైలు దిగి.. మరో రైలు కింద నలిగి.. 12 మంది దుర్మరణం

ABN, Publish Date - Jan 23 , 2025 | 05:06 AM

మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా పరందా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోరం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు బోగీకి నిప్పంటుకుందనే వదంతులతో కిందకు దూకారు.

పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చక్రాల వద్ద నిప్పురవ్వలు

అగ్నిప్రమాదం అంటూ వదంతులు

చైన్‌ లాగి కిందకు దిగిన 50 మంది

అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ ఢీ

12 మంది అక్కడికక్కడే మృతి.. ఛిద్రమైన శరీరాలు

మరో 10 మందికి గాయాలు: ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి.. మహారాష్ట్ర జాల్గావ్‌లో ఘటన

ముంబై, జనవరి 22: మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా పరందా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోరం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు బోగీకి నిప్పంటుకుందనే వదంతులతో కిందకు దూకారు. అటుగా వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 35 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఓ బాలుడు, ముగ్గురు మహిళలున్నారు. ఈ ఘటనపై జల్గావ్‌ ఎస్పీ డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన అందజేసిన వివరాల ప్రకారం.. జల్గావ్‌ నుంచి బయలుదేరిన పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5 గంటల సమయంలో పరందా స్టేషన్‌ సమీపానికి రాగానే.. జనరల్‌ బోగీ చక్రాల వద్ద నిప్పురవ్వలు వచ్చి, పొగ రేగింది. దీంతో.. ఓ ప్రయాణికుడు ‘‘బోగీకి నిప్పంటుకుంది’’ అంటూ అరిచాడు. అది విని కంగారు పడ్డ ప్రయాణికులు చైన్‌ లాగారు. రైలు ఆగడంతో సుమారు 50 మంది ప్రయాణికులు రైలులోంచి కిందకు దిగారు. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ సరిగ్గా ఓ భారీ కల్వర్టు వద్ద ఆగడంతో.. ఒకవైపు సేఫ్టీవాల్‌, లోయను తలపించే కాలువ.. మరోవైపు రెండో ట్రాక్‌ ఉన్నాయి. దీంతో.. ప్రయాణికులు ట్రాక్‌ ఉన్న వైపు దిగి.. నిప్పురవ్వలు వచ్చిన ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ.. అక్కడే నిలబడ్డారు. అంతలో మృత్యుశకటంగా కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ వారు నిలబడ్డ ట్రాక్‌ వైపు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. ప్రయాణికులు తేరుకుని, పక్కకు తప్పుకొనేలోపే.. ట్రాక్‌పై ఉన్నవారిని ఢీకొంటూ.. వారిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పదేళ్ల వయసున్న ఓ బాలుడితోపాటు.. ముగ్గురు మహిళలున్నారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.


మిగతావారు జరిగిన దారుణాన్ని అర్థం చేసుకునేలోపు.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు మృతదేహాల చేతులు, కాళ్లు తెగి.. రక్తపు ముద్దలు ట్రాక్‌పై దర్శనమిస్తూ.. బీభత్సమైన దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కూడా తొలుత 11 మంది మృతిచెందారని భావించారు. అయితే.. ఆస్పత్రిలో శరీర భాగాలను మృతదేహాల వారీగా జతచేయగా.. 12 మంది చనిపోయినట్లు తేలిందని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి వివరించారు. క్షతగాత్రులను పచోరాలోని బృందావన్‌ ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సంఘటనాస్థలిని జల్గావ్‌ ఎంపీ స్మితావాఘ్‌, మాజీ ఎంపీ ఉన్మేశ్‌పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ ఆయుష్‌ ప్రసాద్‌, ఐజీ దత్తాత్రేయ కరాలే సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదమేమీ జరగలేదని, కేవలం వదంతులతోనే దారుణం జరిగిందన్నారు. మృతులంతా జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నవారేనని వివరించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘ఘటన సమాచారం అందగానే ఎనిమిది అంబులెన్స్‌లను పంపించాం. మంత్రి గిరీశ్‌ మహాజన్‌, ఇతర అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మహారాష్ట్ర సర్కారు తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.


ఇది కూడా చదవండి..

Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో

State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు

influential Indians : సత్యం.. సుందరం!

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 23 , 2025 | 05:07 AM