Telangana CM : పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:32 AM
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపికలో తెలంగాణకు అవమానం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపికలో తెలంగాణకు అవమానం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.
వెండి తెర శోభాయమానం!
తన నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని అలరించారు శోభన! సినీ నటిగా, నాట్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో ‘విక్రమ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్‌బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. ఇప్పటి వరకు 230కి పైగా చిత్రాల్లో నటించారు. 1994లో విడుదలైన ‘మణిచిత్రతళు’ అనే మలయాళ సినిమాకు గాను ఆమెకు భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. నటనతో పాటు శాస్త్రీయ నృత్యం అంటే శోభనకు ప్రాణం. 1989లో సొంతంగా ఓ డ్యాన్స్ స్కూల్‌ని ప్రారంభించారు. దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భరత నాట్యంలో శిక్షణ ఇచ్చేందుకు శోభన 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను ప్రారంభించారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలో, నాట్యంలో శిక్షణ పొందుతున్నారు. శోభన 1970 మార్చి 21న తిరువనంతపురంలో జన్మించారు. పూర్తి కళా రంగానికే అంకితమైన శోభన ఇంత వరకూ వివాహం చేసుకోలేదు.
Updated Date - Jan 26 , 2025 | 04:33 AM