ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UGC : యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి

ABN, Publish Date - Feb 06 , 2025 | 05:12 AM

యూజీసీ ముసాయిదా నిబంధనలను తక్షణం వెనక్కితీసుకోవాలని ఆరు విపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. ఈమేరకు.. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల ఉన్నత విద్యా శాఖ మంత్రులు/ప్రతినిధులతో బెంగళూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో 15 సూత్రాల

బెంగళూరులో జరిగిన ఆరు విపక్ష పాలిత రాష్ట్రాలఉన్నత విద్యా శాఖ మంత్రుల సమావేశంలో తీర్మానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: యూజీసీ ముసాయిదా నిబంధనలను తక్షణం వెనక్కితీసుకోవాలని ఆరు విపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. ఈమేరకు.. కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల ఉన్నత విద్యా శాఖ మంత్రులు/ప్రతినిధులతో బెంగళూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో 15 సూత్రాల తీర్మానం చేసినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. వర్సిటీల ఉపకులపతుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకే కీలకపాత్ర ఇవ్వాలని ఆరు రాష్ట్రాల విద్యామంత్రులూ ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సమాఖ్య విధానంలో రాష్ట్రాలకు చట్టబద్ధంగా దఖలు పడిన హక్కులకు ఈ ముసాయిదా నిబంధనలు తీవ్రంగా విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. వైస్‌చాన్స్‌లర్ల ఎంపిక నిమిత్తం ‘సెర్చ్‌ కమ్‌ సెలెక్షన్‌ కమిటీ’ల ఏర్పాటుకు రాష్ట్రాలకున్న హక్కులను హరిస్తున్నాయని ధ్వజమెత్తారు. నాన్‌-అకడమిక్‌ అభ్యర్థులను వీసీలుగా నియమించే వీలు కల్పించే నిబంధనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలా పలు ప్రతిపాదనలపై అభ్యంతరాలు తెలిపిన మంత్రులు.. యూజీసీ ముసాయిదా నిబంధనలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 05:12 AM