ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coimbatore : తమిళనాడులో బాలికపై ఏడుగురి గ్యాంగ్‌ రేప్‌

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:23 AM

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి

చెన్నై, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు కాలేజీ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కోయంబత్తూరు ఉక్కడం ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్‌ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటోంది. ఇటీవల ఆ బాలికకు సామాజిక మాధ్యమాల ద్వారా కునియముత్తూరుకు చెందిన కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆ బాలికను మాయమాటలతో కునియముత్తూరులో ఉన్న తన గదికి రప్పించుకున్న ఆ విద్యార్థి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. అంతేగాక ఆరుగురు సహచర విద్యార్థులను కూడా తన గదికి రప్పించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. బాలికను సోమవారం ఉదయం వారు ఆమె ఇంటివద్ద విడిచిపెట్టి పారిపోయారు. ఈ ఘటనపై ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Updated Date - Feb 19 , 2025 | 04:23 AM