ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Russian Oil : రష్యా నుంచి చమురు ఇక కష్టమే!

ABN, Publish Date - Jan 24 , 2025 | 04:40 AM

రష్యా చమురు రంగంపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం మన చమురు దిగుమతులపై తీవ్రంగా పడుతోంది. మార్చి నెలకు అవసరమైనంత చమురు దిగుమతులు రష్యా నుంచి వచ్చే అవకాశాలు లేవని

అమెరికా ఆంక్షల ఫలితంగా మార్చిలో 20 శాతానికి తగ్గనున్న సరఫరా

పశ్చిమాసియా మార్కెట్ల ద్వారా లోటు భర్తీ

ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 23: రష్యా చమురు రంగంపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం మన చమురు దిగుమతులపై తీవ్రంగా పడుతోంది. మార్చి నెలకు అవసరమైనంత చమురు దిగుమతులు రష్యా నుంచి వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వరంగ చము రు సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) రామకృష్ణగుప్తా తెలిపారు. గత ఏడాది అక్టోబరు-డిసెంబరుతో కూడిన త్రైమాసికంలో తమ సంస్థ శుద్ధి చేసిన ముడి చమురులో 31 శాతం రష్యా నుంచి వచ్చినదేనని, ఈ ఏడాది మార్చికి ఇది 20 శాతానికి పడిపోనుందని వెల్లడించారు. దీనిని భర్తీ చేయటానికి పశ్చిమాసియా తదితర ప్రత్యామ్నాయ మార్కెట్లను సంప్రదిస్తామని, ఆయా మార్కెట్లలో ముడి చమురు కావాల్సినంత ఉందని ఆయన తెలిపారు.


యుద్ధం నేపథ్యంలో చవకగా రష్యా చమురు

చమురు అవసరాల కోసం భారత్‌ ఎక్కువగా గల్ఫ్‌ దేశాలపైనే ఆధారపడి ఉండేది. 2022లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత.. రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసే ఉద్దేశంతో అమెరికా, పశ్చిమదేశాలు రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు విధించాయి. దీం తో రష్యా తక్కువ ధరకే ముడి చమురును విక్రయించటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్‌ ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుం ది. భారత్‌ చమురు కొనుగోళ్లలో రష్యా వాటా దాదా పు 40 శాతానికి చేరుకుంది (2022కి ముందు ఇది 0.4ు). అయితే, ఈ ఏడాది జనవరి 10న రష్యా చమురు సంస్థలపై ఆంక్షలను అమెరికా మరింత కఠినతరం చేసింది. దీంతో ఆ దేశం నుంచి చమురు సరఫరాలు గతంలో ఉన్నట్లుగా అందుబాటులో లేవు.

Updated Date - Jan 24 , 2025 | 04:40 AM