Cancer: క్యాన్సర్ కబళిస్తోంది
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:31 AM
దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నివేదిక స్పష్టం చేస్తోంది. అలాగే భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్‌సీఆర్‌పీ) నివేదించింది.
దేశంలో భారీగా పెరుగుతున్న మహమ్మారి
ఆగ్నేయాసియాలో పరిస్థితి ఆందోళనకరం
2022లో 24 లక్షల కేసులు వెలుగులోకి
వారిలో 56 వేల మంది చిన్నారులు
ఆ ఏడాది 15 లక్షల మంది మృత్యువాత
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో నివేదిక
ఐఐటీ మద్రా్‌సలో క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ ప్రారంభం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ప్రపంచ మానవాళికి సవాల్ విసురుతున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. దీనికి భారత దేశం మినహాయింపేమీ కాదు. దేశంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నివేదిక స్పష్టం చేస్తోంది. అలాగే భారత్‌లో ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్‌సీఆర్‌పీ) నివేదించింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా భారత్ సహా ఆగ్నేయాసియా అంతటా క్యాన్సర్ కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 2022లో కొత్తగా 24 లక్షల కేసులు బయటపడ్డాయని, వారిలో 56 వేల మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. 2022లో క్యాన్సర్‌తో 15 లక్షల మంది చనిపోయారని వెల్లడించింది. ఈ ప్రాంతంలో నోటి, గర్భాశయ, బాల్య కేన్సర్లు ఎక్కువగా నమోదయ్యాయని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ సైమా వాజెద్ సోమవారం తెలిపారు. 2050 నాటికి ఈ ప్రాంతంలో కొత్త క్యాన్సర్ కేసులు, మరణాలు 85 శాతం పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఆయా ప్రభుత్వాల నేతృత్వంలో డబ్ల్యూహెచ్‌వో, ఇతర భాగస్వాముల మద్దతుతో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పుని ఎదుర్కోవడానికి ఈ ప్రాంతాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని వాజెద్ పిలుపునిచ్చారు.
సమష్టి పోరాటం అవసరం
మానవాళికి సవాల్ విసురుతున్న క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, దాని నివారణకు చర్యలు తీసుకోవడం, ముందస్తుగానే గుర్తించి మెరుగైన చికిత్సను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రతిఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఎంపిక చేసిన థీమ్ ‘యునైటెడ్ బై యూనిక్’.. కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ను కట్టడి చేయడానికి డబ్ల్యూహెచ్‌వో కృషి చేస్తోంది. అయినప్పటికీ ఆగ్నేయాసియాలో క్యాన్సర్ బాధితులు పెరగడంపై సైమా వాజెద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు క్యాన్సర్ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయని అంటూనే.. దీనికోసం మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని పేర్కొన్నారు. భూటాన్ 2020లో హెల్త్ ఫ్లాగ్‌షి్‌పను విజయవంతంగా పూర్తిచేసిందని తెలిపారు. ఇక్కడి ‘క్యాన్సర్ ఎనీవేర్’ కార్యక్రమం ద్వారా థాయ్‌లాండ్ క్యాన్సర్ నిర్వహణకు యూనివర్సల్ హెల్త్ కవరేజీ విధానాన్ని అవలంబిస్తోందని వాజెద్ చెప్పారు. ఎనిమిది దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రవేశపెట్టాయన్నారు. స్థానిక సంస్థల ద్వారా పిల్లల్లో వచ్చే క్యాన్సర్ల నియంత్రణకు పది దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్‌కు కారణమైన పొగాకు వాడకం బాగా తగ్గిందని.. ఈ దిశగా డబ్ల్యూహెచ్‌వో అన్ని సభ్య దేశాలతో కలిసి పనిచేసిందని చెప్పారు. క్యాన్సర్ నియంత్రణకు దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏకరీతిగా లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ నివారణ చర్యలు, కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని చెప్పారు. ఇది లక్షలాది కొత్త కేసులకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సభ్యదేశాలతో కలిసి 2024-2030 మధ్య క్యాన్సర్ నివారణ, నిర్వహణ కోసం ప్రాంతీయ వ్యూహాన్ని రూపొందించిందని, దీని అమలుకు 77వ ప్రాంతీయ కమిటీ ఆమోదించిందని వాజెద్ పేర్కొన్నారు.
ఐఐటీ మద్రా్‌సలో కేన్సర్ జీనోమ్ డేటాబేస్ ప్రారంభం
చెన్నై, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఐఐటీ-మద్రాస్ తొలిసారిగా ‘కేన్సర్ జీనోమ్ డేటాబే్‌స’ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి ప్రకటించారు. వివిధ రకాలైన కేన్సర్ చికిత్సల కోసం జన్యుపరమైన ఖాళీని భర్తీ చేసేందుకు వీలుగా కేన్సర్ జీనోమ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సేకరించిన 480 బ్రెస్ట్ కేన్సర్ రోగుల కణజాల నమూనాల నుంచి 960 ఎక్సోమ్ సీక్వెన్సింగ్‌ను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. భాతర్ కేన్సర్ జీనోమ్ అట్లాస్ (బీసీజీఏ) పేరుతో ఈ డేటాబే్‌సను విడుదల చేసినట్టు వెల్లడించారు.
మరిన్ని...
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 04 , 2025 | 04:31 AM