ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్‌కే ‘అయోధ్య’ను తెచ్చిన తెలుగోడు!

ABN, Publish Date - Feb 01 , 2025 | 05:11 AM

అధికారు లు నియంత్రిస్తున్నారని అసంతృప్తికి గురవుతున్నారా? నిరుత్సాహపడొద్దు.. మహా కుంభమేళాకే అయోధ్య తరలివచ్చింది. అచ్చంగా అయోధ్యలోని మందిరాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగేలా నిర్మించారు.

రామమందిర ప్రతిరూపం నిర్మించిన కళాదర్శకుడు రమణ వంక

81 అడుగుల ఎత్తుతో 16,800 చ.అ విస్తీర్ణంలో మందిరం

నిర్మాణంలో వెదురు కర్రలు, ఫోమ్‌, ఫైబర్‌.. 25 రోజుల్లోనే పూర్తి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పుణ్యస్నానాల కోసం మహాకుంభమేళా వెళుతున్నారా? అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లాలని మనసులో ఉన్నా.. అధికారు లు నియంత్రిస్తున్నారని అసంతృప్తికి గురవుతున్నారా? నిరుత్సాహపడొద్దు.. మహా కుంభమేళాకే అయోధ్య తరలివచ్చింది. అచ్చంగా అయోధ్యలోని మందిరాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగేలా నిర్మించారు. ఈ అయోధ్య మందిర ప్రతిరూపాన్ని నిర్మించింది ప్రముఖ తెలుగు కళాదర్శకుడు రమణ వంక. ఓ ప్రైవేటు సంస్థ.. త్రివేణి సంగమానికి కిలోమీటరున్నర దూరంలో చుంగ్లీ అనే చోట భక్తుల కోసం ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తోంది. అందులో భాగంగా.. రమణ వంక అచ్చంగా అయోధ్యను తలపించేలా 16,800 చదరపు అడుగుల విస్తీర్ణం, 140 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పుతో మందిరాన్ని కట్టా రు.


నిర్మాణంలో వెదురు కర్రలు, వస్త్రాలు, ఫోమ్‌ మెటి రియల్‌, ఫైబర్‌ను ఉపయోగించారు. గర్భాలయంలో కూడా అయోధ్యలో మాదిరిగానే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం 20వేలమంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో అయోధ్య రామమందిర ప్రతిరూపాన్ని నిర్మించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తునట్లు రమణ వంక ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. నిర్మాణంలో 200 మంది కార్పెంటర్లు, సివిల్‌ వర్కర్లు పాలుపంచుకున్నారని.. 25 రోజుల్లో నిర్మాణం పూర్తిచేశామని వివరించారు. డిసెంబరు 29న ప్రత్యేక పూజలతో ఆలయాన్ని తెరిచామని చెప్పారు.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:11 AM