Bombay HC: కోర్టులో సెల్‌ఫోన్‌తో రికార్డింగ్ దుష్ప్రవర్తనే
ABN, Publish Date - Mar 02 , 2025 | 05:28 AM
గురువారం ఆస్తి వివాదంపై జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాతా ధర్మాసనం ఎదుట వాదనలు జరుగుతున్నప్పుడు ప్రతివాది బంధువు సాజిద్ అబ్దుల్ జబ్బార్ పటేల్ వాటిని రికార్డింగ్ చేశాడు.
ముంబై, మార్చి1: కోర్టు కార్యకలాపాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వాదోపవాదాలను ఆడియో రికార్డింగ్ చేసిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించింది. గురువారం ఆస్తి వివాదంపై జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాతా ధర్మాసనం ఎదుట వాదనలు జరుగుతున్నప్పుడు ప్రతివాది బంధువు సాజిద్ అబ్దుల్ జబ్బార్ పటేల్ వాటిని రికార్డింగ్ చేశాడు. దీన్ని గమనించిన కోర్టు సిబ్బంది సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సెల్‌ఫోన్‌తో రికార్డు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. రూ.లక్ష జరిమానా విధించింది. మూడు రోజుల్లో హైకోర్టు ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమ నిధికి ఆ సొమ్మును చెల్లించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2025 | 05:28 AM