Ranya Rao: 14.2 కిలోల బంగారం నడుముకు కట్టుకుని స్మగ్లింగ్
ABN, Publish Date - Mar 06 , 2025 | 05:07 AM
ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా ఓ ప్రొటోకాల్ అధికారి ఆమెకు ఎస్కార్ట్ కల్పించి సెక్యూరిటీ చెక్‌లు లేకుండా బయటకు తీసుకొచ్చేవారు.
బెంగళూరులో కన్నడ నటి రన్యా అరెస్టు
బెంగళూరు, మార్చి 5: రన్యా రావు.. ప్రముఖ కన్నడ నటి. అంతేకాదు.. పోలీసు ఉన్నతాధికారి కుమార్తె. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చారు. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడల్లా ఓ ప్రొటోకాల్ అధికారి ఆమెకు ఎస్కార్ట్ కల్పించి సెక్యూరిటీ చెక్‌లు లేకుండా బయటకు తీసుకొచ్చేవారు. అక్కడి నుంచి ప్రభుత్వ వాహనంలో దర్జాగా వెళ్లిపోయే వారు. సోమవారం రాత్రి కూడా రన్యా రావు అలాగే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చే క్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) బృందం అడ్డుకుంది. సోదాలు చేస్తే.. ఆమె నడుముకు కట్టుకొని అక్రమంగా తరలిస్తున్న 14.2 కిలోల బంగారం దొరికింది. దీని విలువ రూ. 12.56 కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత బెంగళూరులోని లావెల్లె రోడ్‌లో ఉన్న రన్యా రావు ఇంటిలో కూడా అధికారులు సోదాలు జరిపారు.
అక్కడ రూ. 2.06 కోట్ల విలువైన స్వర్ణ ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రన్యా రావు గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు తిరిగారు. ఈ నాలుగు సార్లు కూడా ఆమె ఒకే రకమైన వస్త్రధారణలో ఉన్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించి నిఘా పెట్టారు. సోమవారం దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆమె ఎప్పటిలాగే సులువుగా బయటకు వచ్చేస్తున్నపుడు సోదాలు చేశారు. స్మగ్లింగ్‌కు అనుకూలంగా మార్పులు చేసిన జాకెట్, బెల్ట్ ఆమె ధరించి వాటిల్లో బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్మగ్లర్లు తనను బ్లాక్ మెయిల్ చేసి, బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్నారని రన్యారావు విచారణలో చెప్పినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2025 | 05:07 AM