ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ramesh Bidhuri: ఢిల్లీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తా

ABN, Publish Date - Jan 06 , 2025 | 04:50 AM

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కల్కాజీ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ రోడ్లను హేమమాలిని బుగ్గల్లాగా చేస్తానంటూ అబద్ధం చెప్పారు.

బీజేపీ నేత బిధూరివివాదాస్పద వ్యాఖ్యలు

న్యూడిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్‌ బిధూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కల్కాజీ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ రోడ్లను హేమమాలిని బుగ్గల్లాగా చేస్తానంటూ అబద్ధం చెప్పారు. నేను మాత్రం ఓక్లా, సంగం విహార్‌లో రోడ్లను అభివృద్ధి చేసినట్లే కల్కాజీ రోడ్లను కూడా ప్రియాంక బుగ్గల మాదిరి నిర్మిస్తాన’’ని అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌, ఆప్‌ ఖండించాయి. బిధూరిపై పార్టీ తరపున పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆల్కా లాంబా చెప్పారు. తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో... ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బిధూరి ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

Updated Date - Jan 06 , 2025 | 04:50 AM