Rahul Gandhi: పేదల హక్కుల కోసం ‘వైట్ టీషర్ట్’ ఉద్యమం
ABN, Publish Date - Jan 20 , 2025 | 05:04 AM
పేదలు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. ‘వైట్ టీషర్టుల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
ప్రారంభించిన రాహుల్.. అసమానతలను వ్యతిరేకించేవారు పాల్గొనాలని పిలుపు
న్యూఢిల్లీ, జనవరి 19: పేదలు, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. ‘వైట్ టీషర్టుల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ‘ఆర్థికన్యాయంలో మీకు విశ్వాసం ఉంటే, సంపద అసమానతలను మీరు వ్యతిరేకిస్తే, సామాజిక సమానత్వం కోసం పోరాడాలనుకుంటే, అన్ని రకాల వివక్షలు అంతం కావాలని భావిస్తే, దేశంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తే.. తెల్లరంగు టీషర్టును ధరించి ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి’ అని పిలుపునిచ్చారు. వివరాల కోసం ఠీజిజ్ట్ఛ్టీటజిజీట్ట.జీుఽ/జిౌఝ్ఛ/జిజీుఽ వెబ్‌సైట్‌ను సందర్శించాలని, 99998 12024 నెంబరుకు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా, దేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంఽధీపై అస్సాంలోని గువాహటిలో కేసు నమోదయింది. ఈ నెల 15న ఢిల్లీలో రాహుల్ చేసిన ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మొంజిత్ చెతియా అనే వ్యక్తి పాన్‌బజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Updated Date - Jan 20 , 2025 | 05:04 AM