ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : మహాకుంభమేళాలో మోదీ

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:35 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించారు. రుద్రాక్షలు ధరించిన ఆయన మంత్ర జపం చేశారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన యూపీ సీఎం

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం

గంగాహారతితో పాటు ప్రత్యేక పూజలు

లఖ్‌నవూ, ఫిబ్రవరి5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించారు. రుద్రాక్షలు ధరించిన ఆయన మంత్ర జపం చేశారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పడవలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పడవలోనుంచే భక్తులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. గంగా మాత ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, శాంతి, కలగాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. పవిత్ర స్నానమాచరించిన ఫొటోలు కూడా జతచేశారు. 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు. మహాకుంభమేళా సందర్భంగా ఈ నెల పదో తేదీలోపు పాతికవేల మంది గిరిజనులు పుణ్యస్నానాలు చేయనున్నారు. గురువారం నుంచి ఆదివాసీల పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయని ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ విభాగం వనవాసీ కళ్యాణ ఆశ్రమం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం భారీ ఊరేగింపులతో శోభాయాత్ర నిర్వహిస్తామని వెల్లడించింది. పదవ తేదీ వరకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆట, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు, మహాకుంభమేళాలో మౌని అమావాస్యనాడు జరిగిన తొక్కిసలాటకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని పంచ్‌దశ్నమ్‌ జునా అఖాడా మహామండలేశ్వర్‌ యతి నరసింఘానంద గిరి చెప్పారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాసినట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:36 AM