ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మహిళా సాధికారతలో ఏఐ పాత్ర.. మంత్రి రాసిన ఆర్టికల్‌ షేర్ చేసిన ప్రధాని మోదీ..

ABN, Publish Date - Mar 09 , 2025 | 05:11 PM

తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్‌ రాసిన ఓ ఆర్టికల్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళ సాధికారతలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి ఆవిష్కరిస్తూ సావిత్రి ఠాకూర్‌ రాసిన ఓ వ్యాసం ఓ దినపత్రికలో ప్రచురితమైంది. ఆ వ్యాసాన్ని ప్రధాని మోదీ ఆఫీస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

PM Modi

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (Womens day) పలు దేశాలు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. మనదేశంలో కూడా మహిళా సాధికారతను వర్ణిస్తూ ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొన్ని మహిళా శక్తి గురించి మాట్లాడారు. తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్‌ రాసిన ఓ ఆర్టికల్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళ సాధికారతలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి ఆవిష్కరిస్తూ సావిత్రి ఠాకూర్‌ (Minister Savitri Thakur) రాసిన ఓ వ్యాసం ఓ దినపత్రికలో ప్రచురితమైంది.


ఆ పత్రిక క్లిప్‌ను ప్రధాని మోదీ ఆఫీస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. మన మాతృమూర్తులు, సోదరీమణులు, కూతుళ్లను మరింత శక్తివంతంగా మార్చడంలో, వారికి మరిన్ని అవకాశాలు కల్పించడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్‌ పేర్కొన్నారు. నారీ శక్తికి అంకితం ఇస్తూ ఆమె రాసిన ఈ వ్యాసాన్ని చదవండి అంటూ పీఎమ్‌ఓ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వ్యాసం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది.


కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ మెయిటేన్‌ చేసే వారంతా మహిళలే అంటూ మోదీ తెలిపారు. అలాగే గుజరాత్‌లో ప్రధాని హాజరైన ఓ సభకు భద్రత మొత్తాన్ని మహిళా పోలీసులే పర్యవేక్షించారు. 2,400 మహిళా పోలీసులు ప్రధాని భద్రతను పర్యవేక్షించారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2025 | 05:11 PM