ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RSS: ఆర్‌ఎస్ఎస్‌పై ప్రధాని ప్రశంసలు.. దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తి రగిలించిందని వ్యాఖ్య

ABN, Publish Date - Feb 22 , 2025 | 12:34 PM

దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ తనతో పాటు లక్షలాది మందిలో కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనలో కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన 98వ అఖిల భారత్ మరాఠీ సాహ్యిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి శతాబ్దం అయిన నేపథ్యంలో మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. తనతో పాటు దేశంలోని లక్షలాది మందిలో దేశం కోసం జీవించాలన్న తపన ఆర్ఎస్‌ఎస్ కలిగించిందని వ్యాఖ్యానించారు (PM Modi).


Dharmendra Pradhan: బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టీకరణ

మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలపై కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. ‘‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెనక మారాఠీ మూలాలున్న వ్యక్తి ఉన్నారన్న వాస్తవం మాకందరికీ ఎంతో గర్వకారణం. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అయ్యింది. వటవృక్షంలా విస్తరించింది’’ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ కారణంగానే తనకు మరాఠీ భాష, సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధం ఏర్పడిందని అన్నారు. కొత్త తరాలకు భారతీయ సంస్కృతి, విలువలను పరిచయం చేసేందుకు ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా సాంస్కార యజ్ఞం చేస్తోందని వ్యాఖ్యానించారు.


DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక భారతీయ భాషల మధ్య ఎటువంటి శత్రుత్వ భావన లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారతీయ భాషలు పరస్పరం సుసంపన్నమయ్యాయని అన్నారు. ధైర్యస్థైర్యాలు, అందం, సున్నితత్వం, సమానత్వం వంటి అనేక భావాలతో కూడి పూర్తిస్థాయి భాష మరాఠీ అని వ్యాఖ్యానించారు. భాష పేరిట ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరిగిన ప్రతిసారీ, భారతీయ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. తప్పుడు భావనలకు దూరం జరిగి అన్ని భాషలను సంపన్నం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. త్రిభాషా విద్యావిధానాన్ని తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని తమిళనాడు సీఎం ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 01:41 PM