Delhi Politics: ఢిల్లీ సీఎం ఆఫీసులో అంబేడ్కర్ ఫొటో తీసేశారు
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:25 AM
దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పాలక బీజేపీ మధ్య తాజాగా ఫొటోల యుద్ధం మొదలైంది. సీఎం కార్యాలయంలో అంబేడ్కర్, భగత్‌సింగ్ ఫొటోలు తీసేశారంటూ మాజీ సీఎం, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆతిశీ సోమవారం ఆరోపించారు.
ఆప్ ఆరోపణ.. అంతా వట్టిదేనంటూ బీజేపీ మండిపాటు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పాలక బీజేపీ మధ్య తాజాగా ఫొటోల యుద్ధం మొదలైంది. సీఎం కార్యాలయంలో అంబేడ్కర్, భగత్‌సింగ్ ఫొటోలు తీసేశారంటూ మాజీ సీఎం, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆతిశీ సోమవారం ఆరోపించారు. వాటిస్థానంలో మహాత్మాగాంధీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఫొటోలు పెట్టారని సభలో అనడమే గాక.. ‘ఎక్స్’లో ఆ ఫొటోలను పోస్టుచేశారు. బీజేపీ దళిత వ్యతిరేకి, సిక్కు వ్యతిరేకి అని మరోసారి రుజువైందన్నారు. ఈ ఆరోపణలను సీఎం రేఖా గుప్తా, బీజేపీ నేతలు తిప్పికొట్టారు. సీఎం ఆఫీసులో గాంధీజీ, రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలతో పాటు ఉన్న అంబేడ్కర్, భగత్‌సింగ్ చిత్రాలున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆప్ సర్కారు అవినీతిని బహిర్గతం చేసే ‘కాగ్’ నివేదికలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామని.. వీటి భయంతోనే ఆప్ అగ్ర నేతలు ఫొటోలపై రచ్చచేస్తున్నారని కమలనాథులు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2025 | 04:25 AM