Tejas Fighter Jet: తేజస్ ఆలస్యంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:34 AM
రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. తేజస్ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) తయారు చేస్తున్న విషయం తెలిసిందే..!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: తేజస్ యుద్ధవిమానాల తయారీలో ఆలస్యానికి కారణాలను గుర్తించి, పరిష్కారాలను సూచించేందుకు రక్షణ శాఖ ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. తేజస్ యుద్ధ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) తయారు చేస్తున్న విషయం తెలిసిందే..! ఇటీవల భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ హాల్ తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఏరో ఇండియా షో’లో ఆయన మాట్లాడుతూ.. 2009-10లో ఆర్డరిచ్చిన తేజస్ విమానాలను హాల్ ఇంకా డెలివరీ చేయలేదని, ఆ సంస్థపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులిచ్చింది.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2025 | 04:34 AM