ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Owaisi: వక్ఫ్‌ బిల్లుతో సామాజిక అస్థిరత: అసదుద్దీన్‌

ABN, Publish Date - Feb 05 , 2025 | 04:49 AM

సోమవారం ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే.. వక్ఫ్‌ ఆస్తులుండవు. ఏదీ మిగలదు’’ అని అన్నారు. ఒక గర్వించదగ్గ భారతీయ ముస్లింగా తాను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాన్నారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ‘‘వక్ఫ్‌ సవరణ బిల్లును డ్రాఫ్ట్‌లో ఉన్నట్లే చట్టంగా తీసుకువస్తే.. దేశంలో సామాజిక అస్థిరత రాజ్యమేలుతుంది. ఏ ముస్లిం కూడా ఈ బిల్లును ఆమోదించడం లేదు’’ అని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. సోమవారం ఈ మేరకు లోక్‌సభలో ప్రకటన చేశారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే.. వక్ఫ్‌ ఆస్తులుండవు. ఏదీ మిగలదు’’ అని అన్నారు. ఒక గర్వించదగ్గ భారతీయ ముస్లింగా తాను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాన్నారు. ‘‘ఒక మసీదుకు చెందిన.. లేదా ఒక దర్గాకు చెందిన ఒక్క అంగుళం స్థలాన్ని కూడా వదులుకునేందుకు ముస్లింలు సిద్ధంగా లేరు. భారతీయుడిగా నేను గర్విస్తా. ఇది నా దేశం. ఎవరో ఇచ్చింది కాదు. ఎవరూ లాక్కోలేరు కూడా. వక్ఫ్‌ అంటేనే నా దృష్టిలో ఓ ప్రార్థన స్థలం’’ అని వివరించారు. విపక్ష ఎంపీలు కల్యాణ్‌ బెనర్జీ, మహమ్మద్‌ నదీముల్‌ హక్‌ కూడా వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకించారు. అసదుద్దీన్‌ వ్యాఖ్యలను వక్ఫ్‌పై ఏర్పాటు చేసిన జేపీసీ చైర్మన్‌ జగదంబికాపాల్‌ తీవ్రంగా ఖండించారు. జేపీసీలో అసదుద్దీన్‌ కూడా ఉన్నారని, ఆయన సమక్షంలోనే ఓటింగ్‌ జరిగిందని గుర్తుచేశారు.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:50 AM