NEET-UG Exam : మే 4న నీట్-యూజీ పరీక్ష
ABN, Publish Date - Feb 08 , 2025 | 05:40 AM
దేశంలోని వైద్య విద్య కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను మే 4వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ పరీక్ష కోసం శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 7వ
మార్చి 7 వరకు దరఖాస్తుకు గడువు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశంలోని వైద్య విద్య కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను మే 4వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ పరీక్ష కోసం శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొత్తంగా 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దాదాపు 56 వేలు ప్రభుత్వ ఆస్పత్రులు, దాదాపు 52వేలు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. డెంటిస్ర్టీ, ఆయుర్వేద, యునానీ, సిద్ధాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా నీట్ ఫలితాలు ఉపయోగపడతాయి. పెన్ను, పేపర్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నట్టు గత నెలలో ఎన్టీఏ పేర్కొంది.
Updated Date - Feb 08 , 2025 | 05:40 AM