ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nandamuri Balakrishna : అన్‌స్టాపబుల్‌ బాలయ్య!

ABN, Publish Date - Jan 26 , 2025 | 04:24 AM

నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరో పక్క వైద్యరంగంలో సేవలు.. ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పని

డైలాగ్‌ పలికితే థియేటర్‌ దబిడి దిబిడే

నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరో పక్క వైద్యరంగంలో సేవలు.. ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పని చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేషసేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్‌ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడెప్పుడో 1960ల్లో ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు.. కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. విజయానికి దగ్గిర దారులు వెదుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్‌ చెప్పడంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్‌ వాయి్‌సలో ఆయన తెరపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లి పోతుంటాయి. తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజజీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు. క్రమశిక్షణకు ప్రాణం ఇస్తారు బాలకృష్ణ. అలాగే ఆయనది ముక్కుసూటితత్వం. నాన్చుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పడం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం అలవాటు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్‌ సంపాదించుకున్నారు.

రాజకీయ నాయకుడిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు. మూడు సార్లు హిందూపరం శాసససభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్‌ సాధించిన బాలకృష్ణ ప్రజా సేవలోనూ తన ముద్రను చాటారు. బాలకృష్ణకు సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినీ దిగ్గజం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. లెజండరీ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని నిలబెడుతూ... మీరు సినిమా, రాజకీయాలు, దాతృత్వంలో మేటిగా నిలిచారు. ప్రజా సంక్షేమానికి మీ అంకితభావం... ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా లెక్కలేనన్ని జీవితాలకు స్వాంతనను చేకూర్చింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. మీ సేవలకు ఇది నిజమైన గుర్తింపు. దయాళువైన నేతకు తగిన గౌరవం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పద్మభూషణ్‌ అందుకున్న మీ అందరి బాలయ్య, నా ముద్దుల మావయ్య బాలకృష్ణకు అభినందనలు’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 04:24 AM