Delhi Elections: ముస్లింల అడ్డాలో ఆప్ జెండా
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:51 AM
కాంగ్రెస్ ప్రత్యర్థిగా బరిలో ఉండటంతో ఇతర ప్రాంతాల్లో ఓట్ల చీలిక కమలం పార్టీకి లాభించినా... ముస్లింల ప్రాబల్యం ఉన్న చోట్ల మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
7 నియోజకవర్గాల్లో 6 చోట్ల విజయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ సీనియర్ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరులు ఓటమి చవిచూసినా... ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ పార్టీ పట్టు నిలబెట్టుకుంది. కాంగ్రెస్ ప్రత్యర్థిగా బరిలో ఉండటంతో ఇతర ప్రాంతాల్లో ఓట్ల చీలిక కమలం పార్టీకి లాభించినా... ముస్లింల ప్రాబల్యం ఉన్న చోట్ల మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు. ఢిల్లీలో ఎంఐఎం పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఆప్, బీజేపీ చెరో స్థానం నెగ్గాయి.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..
Updated Date - Feb 09 , 2025 | 04:51 AM