Saif Ali Khan: సైఫ్‌పై దాడి చేసింది బంగ్లాదేశీయుడు!
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:28 AM
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడనే ఆరోపణలపై మహ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్(30) అలియాస్ బిజయ్ దాస్ అనే బంగ్లాదేశ్ పౌరుడిని ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
థానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అరెస్టు, కోర్టులో హాజరు
ఐదు రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతి
ముంబై, జనవరి 19: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడనే ఆరోపణలపై మహ్మద్ షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్(30) అలియాస్ బిజయ్ దాస్ అనే బంగ్లాదేశ్ పౌరుడిని ముంబై పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. థానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో షరీఫుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... అతనిని బాంద్రా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడి ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతినిచ్చింది. బంగ్లాదేశ్ పౌరుడైన షరీఫుల్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి బిజయ్ దాస్ అనే పేరుతో చలామణీ అవుతున్నాడని పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. దొంగతనం చేసేందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన షరీఫుల్.. సైఫ్‌పై దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. వందలాది సీసీ కెమెరా ఫుటేజీల పరిశీలన అనంతరం దాదర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడి సంచారాన్ని గుర్తించామని, థానే సమీపంలోని ఓ కార్మిక శిబిరంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. షెహజాద్ బంగ్లాదేశీ కావడంతో సైఫ్‌పై దాడి వెనుక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందా ? అని దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. కాగా, సైఫ్‌పై దాడి కేసులో ఛత్తీ్‌సగఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఆకాశ్ కైలాశ్ కనోజియాను విచారణ అనంతరం పోలీసులు విడుదల చేశారు.
Updated Date - Jan 20 , 2025 | 04:28 AM