Microsoft India: రూ.25,700 కోట్ల
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:47 AM
భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణకు, కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు,
భారత్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు
కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్‌ఫ్రా విస్తరణకు ఖర్చు పెడతాం
2030 నాటికి కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ
‘ఎడ్వాంటైజ్ ఇండియా’ రెండో విడతలో భాగంగా..
ఏఐ ఆవిష్కరణల రంగంలో భారత్ లీడర్‌గా
ఎదుగుతోంది: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
బెంగళూరు, జనవరి 7: భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణకు, కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు, యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి.. 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,700 కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. అలాగే.. తాము చేపట్టిన ‘ఎడ్వాంటైజ్ (అఈగఅూఖీఅ(ఐ)ఎఉ) ఇండియా’ కార్యక్రమం రెండో విడతలో భాగంగా వచ్చే ఐదేళ్లలో (2030 నాటికి) కోటి మంది భారతీయులకు ఏఐ నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఏఐ ఆవిష్కరణల విషయంలో భారత్ వేగంగా లీడర్‌గా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన.. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ పెట్టుబడుల ప్రకటన చేశారు. ఈ పెట్టుబడులు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలకు, సంస్థలకు ఉపయోగపడతాయని సత్య నాదెళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు. మనదేశంలో ప్రస్తుతం ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లకు అదనంగా మరొకటి 2026లో అందుబాటులోకి రానుంది. ఆయా డేటాసెంటర్ ప్రాంగణాల్లో క్లౌడ్, ఏఐ మౌలికసదుపాయాలను మైక్రోసాఫ్ట్ ఈ పెట్టుబడుల సాయంతో విస్తరించనుంది. దేశంలో నానాటికీ పెరుగుతున్న ఏఐ స్టార్ట్‌పలు, పరిశోధకుల అవసరాలను తీర్చే ‘ఏఐ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్’ను అభివృద్ధి చేయనుంది.
మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ ఇన్‌ఫ్రా, డేటాసెంటర్ల అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సంస్థ వందల కోట్ల డాలర్లు గుమ్మరిస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే ఇలా 8000 కోట్ల డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షల కోట్లు) ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రచించింది. భారత్‌లో ఏఐ ఇన్నోవేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చాలన్న ప్రధాని మోదీ స్వప్నం సాకారం కావడానికి ఈ పెట్టుబడి ఉపయోగపడనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ మనదేశంలో 2024లో ప్రారంభించిన ‘ఎడ్వాంటైజ్ ఇండియా’ పథకంలో భాగంగా.. ఏడాదిలో 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది ముగిసే సమయానికి ఆ అంచనాలను మించి.. 24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగలిగింది. వారిలో 65 శాతం మంది మహిళలు కాగా.. 74ు మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలవారే! ప్రపంచవ్యాప్తంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటున్నవారిలో భారతీయ నిపుణులు ఎక్కువగా ఉంటున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలోనే ‘ఎడ్వాంటైజ్ ఇండియా’ రెండో విడత పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ దిశగా మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ (ఎంఎ్‌సఆర్) ల్యాబ్ ఇప్పటికే ఏఐ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ పేరుతో ఫిజిక్స్‌వాలా, రెమిడియో, సాఫ్ట్‌ఎక్స్ వంటి స్టార్ట్‌పలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దేశీయ భాషల్లో లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ రూపొందించడం, ప్రాంప్ట్ ఆప్టిమైజేషన్ వంటివాటిలో శిక్షణ ఇస్తోంది.
Updated Date - Jan 08 , 2025 | 04:48 AM