Manipur: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఒకరి మృతి
ABN, Publish Date - Mar 09 , 2025 | 02:30 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు శనివారం నుంచి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దంటున్న కుకీలు కాంగ్‌పోక్పి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
ఇంఫాల్/న్యూఢిల్లీ, మార్చి 8: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ తెగ నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు శనివారం నుంచి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దంటున్న కుకీలు కాంగ్‌పోక్పి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా.. 25 మందికి గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కుకి జో ప్రాంతంలో నిరవధిక బంద్‌కు కుకి జో మండలి పిలుపునిచ్చింది. కుకీల ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వాహనాలపై రాళ్లు రువ్వడమేకాకుండా రోడ్లను తవ్వారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో దాదాపు 114 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 09 , 2025 | 02:30 AM