Anna Hazare: మద్యం కుంభకోణమే ముంచింది!
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:46 AM
ఆప్ నేతలు మద్యం విధానం, అక్రమార్జనపైనే దృష్టి పెట్టి ఓటమి కొని తెచ్చుకున్నారని విమర్శించారు. మద్యం విధానం కుంభకోణంతో కేజ్రీవాల్ ప్రతిష్ఠపై మచ్చ పడిందని, అందుకే ఆ పార్టీకి తక్కువ ఓట్లు పడ్డాయన్నారు.
అదే కేజ్రీవాల్ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చింది ‘లిక్కర్’, అక్రమార్జనపైనే ఆప్ నేతల దృష్టి
అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలన్నా వినలేదు
కేజ్రీవాల్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు: అన్నా హజారే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పరాజయం స్వయంకృతం అని సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. ఆప్ నేతలు మద్యం విధానం, అక్రమార్జనపైనే దృష్టి పెట్టి ఓటమి కొని తెచ్చుకున్నారని విమర్శించారు. మద్యం విధానం కుంభకోణంతో కేజ్రీవాల్ ప్రతిష్ఠపై మచ్చ పడిందని, అందుకే ఆ పార్టీకి తక్కువ ఓట్లు పడ్డాయన్నారు. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్‌కు తాను చాలా కాలంగా చెబుతూ వచ్చానని, ఆయన వినిపించుకోలేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్ నుంచి తాను ఎంతో ఆశించానని, ఆయన మరో మార్గాన్ని ఎంచుకున్నారని, సమాజహితం గురించి కాకుండా రాజకీయపరంగానే కేజ్రీవాల్ ఆలోచించారని పేర్కొన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలనే బాధ్యతను గుర్తెరగడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని విమర్శించారు. నీతిమంతమైన రాజకీయాల గురించి మాట్లాడే కేజ్రీవాల్ స్వయంగా మద్యం విధానం కుంభకోణంలో ఇరుక్కోవడాన్ని ప్రజలే చూశారన్నారు.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..
Updated Date - Feb 09 , 2025 | 04:46 AM