ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Republic Day Parade : గణతంత్ర కవాతుకు కర్తవ్యపథ్‌ సిద్ధం

ABN, Publish Date - Jan 26 , 2025 | 04:47 AM

ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ‘స్వర్ణమయ భారత్‌: వారసత్వం, వికాసం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో హాజరవుతున్నారు.

న్యూఢిల్లీ, జనవరి 25: ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ‘స్వర్ణమయ భారత్‌: వారసత్వం, వికాసం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో హాజరవుతున్నారు. ఇప్పటికే సుబియాంతో ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు, పలు రాష్ట్రాలు, యూటీల నుంచి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి మరో 15 శకటాలను ప్రదర్శన కోసం ఎంపిక చేశారు. రక్షణ శాఖ తొలిసారి బ్రహ్మోస్‌, పినాక, ఆకాశ్‌ వంటి విధ్వంసక క్షిపణులను; యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్‌’ను, డీఆర్‌డీవో రూపొందించిన ‘ప్రళయ్‌’ను ప్రదర్శించనుంది. త్రివిధ దళాల బంధానికి ప్రతీకగా రూపొందించిన త్రివర్ణ శకటాన్ని ఈ కవాతులో తొలిసారి భాగం చేశారు. ఈ సారి రిపబ్లిక్‌ వేడుకల్లో 352 మంది ఇండొనేషియాకు చెందిన బాం్యడ్‌ బృందం ఆకర్షణగా నిలువనుంది.

Updated Date - Jan 26 , 2025 | 04:47 AM