ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gaganyaan Mission: ‘గగన్‌యాన్‌’కు చకచకా!

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:44 AM

ఇస్రో తొలిసారిగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. వచ్చే రెండేళ్లలో రోదసిలోకి వ్యోమగాములను పంపి, తిరిగి వారిని సురక్షితంగా భూమిపైకి తెచ్చే లక్ష్యంతో ఇస్రో ఈ మిషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో మొదటి మానవరహిత యాత్రకు సన్నద్ధమవుతోంది.

ఇస్రో సన్నాహాలు.. షార్‌ చేరుకున్న ఆర్బిటల్‌ మాడ్యూల్‌

సూళ్లూరుపేట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఇస్రో తొలిసారిగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. వచ్చే రెండేళ్లలో రోదసిలోకి వ్యోమగాములను పంపి, తిరిగి వారిని సురక్షితంగా భూమిపైకి తెచ్చే లక్ష్యంతో ఇస్రో ఈ మిషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో మొదటి మానవరహిత యాత్రకు సన్నద్ధమవుతోంది. హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 (హెచ్‌ఎల్‌వీఎం3)-జీ1 ద్వారా ఇస్రో రూపొందించిన ఆర్బిటల్‌ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మాడ్యూల్‌ను బుధవారం ప్రత్యేక వాహనంలో షార్‌కు తెచ్చారు. హెచ్‌ఎల్‌వీఎం3-జీ1 రాకెట్‌ ద్వారా 8,200 కిలోల బరువైన ఆర్బిటల్‌ మాడ్యూల్‌ను 170 కిలోమీటర్ల ఎత్తుకు పంపి 430 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకార కక్ష్యలో లోయర్‌ ఎర్త్‌ అర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 7రోజుల తర్వాత మాడ్యూల్‌ను మళ్లీ భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చే ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ క్రమంలో మిషన్‌ విఫలమయ్యే పరిస్థితి సంభవిస్తే, వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్ధారించుకొనేందుకు మానవ రహిత ప్రయోగం ఉపయోగడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Jan 23 , 2025 | 04:44 AM