Mufti Shah Mir: కులభూషణ్ కిడ్నాప్ సూత్రధారి ముఫ్తీ షా మిర్ దారుణ హత్య
ABN, Publish Date - Mar 09 , 2025 | 02:36 AM
బలూచిస్థాన్‌లోని టర్బాట్‌లో గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మసీదులో ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీ, మార్చి 8: భారత నేవీ మాజీ అధికారి, వ్యాపారవేత్త కులభూషణ్ జాదవ్‌ను ఇరాన్ నుంచి పాకిస్థాన్ ఐఎ్‌సఐ కిడ్నాప్ చేయడంలో కీలకంగా సహకరించిన ముస్లిం ‘స్కాలర్’ ముఫ్తీ షా మిర్ దారుణహత్యకు గురయ్యాడు. బలూచిస్థాన్‌లోని టర్బాట్‌లో గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మసీదులో ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు దాడి చేశారని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలైన ముఫ్తీ షా మిర్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ముఫ్తీ షా గతంలో రెండు హత్యాయత్నాల నుంచి బయటపడ్డాడు. బలూచిస్థాన్‌లోని టర్బాట్ నివాసి అయిన మిర్.. ఐఎ్‌సఐ ఆదేశాల మేరకు పనిచేస్తుంటాడు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 09 , 2025 | 03:42 AM